MS Dhoni Ben Stokes : బెన్ స్టోక్స్ పై ఎంఎస్ ధోనీ ఫోక‌స్

ఇక త‌న వార‌స‌త్వం అత‌డికేనా

MS Dhoni Ben Stokes : వ‌చ్చే ఏడాది 2023లో జ‌రిగే ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) కు సంబంధించి మినీ వేలం పాట ముగిసింది. మొత్తం 10 ఫ్రాంచైజీలు పాల్గొన్నాయి. రూ. 167 కోట్లు ఖ‌ర్చు చేశాయి. 87 స్లాట్స్ కోసం కేవలం 51 మంది ఆట‌గాళ్ల‌ను మాత్ర‌మే కొనుగోలు చేశాయి. అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడు పోయి చ‌రిత్ర సృష్టించాడు సామ్ క‌ర‌న్.

ఏకంగా రూ. 18.25 కోట్ల‌కు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్. ఇదే స‌మ‌యంలో మ‌హేంద్ర సింగ్ ధోనీ సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్ ఊహించ‌ని విధంగా ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండ‌ర్ గా పేరొందిన బెన్ స్టోక్స్(MS Dhoni Ben Stokes) ను వేలం పాట‌లో ఏరికోరి తీసుకుంది. దీంతో ఆ జ‌ట్టుకు అద‌న‌పు బ‌లం చేకూరిన‌ట్ల‌యింది.

ఈ ఏడాది జ‌రిగిన ఐపీఎల్ లో సీఎస్కే ఆశించిన రీతిలో ఆడ‌లేక పోయింది. తాను కెప్టెన్సీ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించి విస్తు పోయేలా చేశాడు ధోనీ. త‌న వార‌సుడు ర‌వీంద్ర జ‌డేజా అని ప్ర‌క‌టించాడు. తీరా ఐపీఎల్ లో చేతులెత్తేశాడు జ‌డేజా. మ‌ళ్లీ సీఎస్కే యాజ‌మాన్యం ఝార్ఖండ్ డైన‌మెట్ కే అప్ప‌గించింది సార‌థ్య బాధ్య‌త‌ల‌ను.

ఇదిలా ఉండ‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్ సిఇఓ కాశీ విశ్వ‌నాథ‌న్ సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు. ధోనీ త‌ర్వాత బెన్ స్టోక్స్ కు సార‌థ్య బాధ్య‌త‌లు అప్ప‌గించే అంశాన్ని ఆలోచిస్తున్న‌ట్లు పేర్కొన్నాడు. ఇందు కోస‌మే ఏరికోరి ఎంచుకున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది. ఏది ఏమైనా బెన్ స్టోక్స్ రావ‌డం వ‌ల్ల ఆ జ‌ట్టుకు అద‌న‌పు బ‌లం చేకూరిన‌ట్ల‌యింది.

Also Read : శ్రీ‌లంక టూర్ జ‌ట్టు ఎంపికపై ఉత్కంఠ

CSK IPL 2023 Auction : మినీ వేలం పాట‌లో ‘డైన‌మిక్’ మార్క్

Leave A Reply

Your Email Id will not be published!