Smriti Mandana : స్మృతి మంధానకు ధోనీ గిఫ్ట్
మహిళా క్రికెటర్ కు క్యాప్ బహుమతి
Smriti Mandana : ఇద్దరూ క్రికెట్ లో పేరు మోసిన వారే. ఒకరు మహిళా క్రికెట్ రంగంలో మోస్ట్ పాపులర్ విమెన్ క్రికెటర్ ముంబైకి చెందిన ఎడమచేతి వాటం బ్యాటర్ స్మృతీ మంధాన(Smriti Mandana). మరొకరు జార్ఖండ్ డైనమెంట్ , భారత మాజీ క్రికెట్ కెప్టెన్ , చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ.
ఇదిలా ఉండగా దిగ్గజ క్రికెటర్ ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు స్మృతీ మంధాన. ఈ సందర్బంగా అరుదైన, ఎళ్లకాలం గుర్తుంచుకునేలా బహుమతిని అందజేశారు ఎంఎస్ ధోనీ. టోపీని స్మృతీ మంధానకు అందజేశారు.
ఈ సందర్బంగా మహిళా క్రికెటర్ అంతులేని ఆనందానికి లోనయ్యారు. తాను జీవితంలో ఎక్కువగా స్పూర్తి పొందిన క్రికెటర్లలో ధోనీ ఒకరని పేర్కొంది. ట్విట్టర్ వేదికగా మంధాన తన ఆనందాన్ని పంచుకుంది. ఇది జీవితంలో మరిచి పోలేని బహుమతి అంటూ సంతోషం వ్యక్తం చేసింది.
ఈ కాలంలో ధోనీ లాంటి దిగ్గజ క్రికెటర్ ఉన్నందుకు భారతీయులైన మనందరం గర్వ పడాలని తెలిపింది స్మృతీ మంధాన. ప్రస్తుతం మంధాన, ధోనీ కలుసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. నెట్టింట్లో వైరల్ గా మారాయి. తాను ఎల్లకాలం గుర్తు పెట్టుకుంటానని తెలిపింది. ఆట పరంగా ఎన్నో అవార్డులు, పురస్కారాలు దక్కాయి. కానీ ధోనీ చేతుల మీదుగా అందుకోవడం గొప్ప అవార్డు అని స్పష్టం చేసింది.
Also Read : DK Shiva Kumar