MS Dhoni : మహేంద్ర సింగ్ ధోనీ. జార్ఖండ్ డైనమెంట్. మోస్ట్ పాపులర్ క్రికెటర్ గా పేరొందాడు. ప్రపంచ క్రికెట్ లో అన్ని రకాల షాట్స్ ఆడగలిగే సత్తా కలిగిన ప్లేయర్లలో ధోనీ ఒకడు.
ప్రధానంగా హెలికాప్టర్ షాట్స్ ఆడడంలో భారత మాజీ కెప్టెన్, మణికట్టు మాంత్రికుడిగా పేరొందిన హైదరాబాదీ స్టార్ మహమ్మద్ అజహరుద్దీన్ తర్వాత ధోనీనే.
బంతి భుజాల మీదకు వచ్చినా అలవోకగా బౌండరీ లైన్ దాటించడంలో మనోడు దిట్ట. నాయకత్వ పటిమ కలిగిన విజేత.
అంతే కాదు ప్రపంచంలో అత్యంత కూల్ కెప్టెన్లలో ధోనీ టాప్ లో ఉన్నాడు.
ఆ తర్వాత న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్. ప్రస్తుతం ఇండియన్ ప్రిమియర్ లీగ్ లో
చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నా ఎంఎస్ ధోనీ(MS Dhoni ). ఆ జట్టుకు అత్యధిక ఐపీఎల్ టైటిళ్లను అందించిన ఘనత అతడిదే.
దుబాయ్ వేదికగా జరిగిన 2021 ఐపీఎల్ రిచ్ లీగ్ లో మొదట్లో ఓడి పోయిన సీఎస్కే జట్టును ఏకంగా టైటిల్ తీసుకు వచ్చేలా చేశాడు. ధోనీకి మంచి ఫినిషర్ అన్న పేరుంది.
ఈ తరుణంలో ఈసారి ముంబై వేదికగా 15వ ఐపీఎల్ సీజన్ ప్రారంభమైంది.
దీని కంటే ముందే సీఎస్కేకు కెప్టెన్ గా ఉన్న ధోనీ ఉన్నట్టుండి మ్యాచ్ ప్రారంభం అవుతుందనగా తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.
అందరిని విస్తు పోయేలా చేశాడు. తన వారసుడు రవీంద్ర జడేజా అంటూ నర్మగర్భంగా మద్దతు తెలిపాడు.
ఈ తరుణంలో ఆ జట్టు ఇప్పటి దాకా 8 మ్యాచ్ లు ఆడింది 6 మ్యాచ్ లలో ఓడి పోయింది.
రెండు మ్యాచ్ లలో గెలుపొందింది. దీంతో పరిస్థితిని గమనించిన జడ్డూ తాను తప్పుకుంటున్నంట్లు ప్రకటించాడు. తిరిగి సీఎస్కే యాజమాన్యం ధోనీకే చాన్స్ ఇచ్చింది.
మరి ధోనీ రాకతోనైనా ఆ జట్టు తల రాత మారుతుందా అన్నది వేచి చూడాలి. ఏమో గుర్రం ఎగురావచ్చు అన్నది పాత సామెత.
ఒకవేళ చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ కు చేరాలంటే కచ్చితంగా అన్ని మ్యాచ్ లు గెలుపొందాల్సి ఉంటుంది. ఇది ప్రస్తుతం జరిగేనా అన్నది అనుమానమే. కానీ టీ20లో ఏది ఏదీ అసాధ్యం కాదు.
Also Read : ఢిల్లీ నీదా నాదా ‘కేంద్రం ఆప్’ లడాయి