MS Dhoni Pandya : టైటిల్ వేటలో ధోనీ..పాండ్యా
ఐపీఎల్ విజేత ఎవరో తేలేది నేడే
MS Dhoni Pandya : భారతీయ క్రికెట్ రంగంలో మోస్ట్ పాపులర్ ఫార్మాట్ గా పేరు పొందింది ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్). 2008 లో దీనికి అంకురార్పణ చేశారు లిలిత్ మోదీ. ఆ తర్వాత అవినీతి ఆరోపణలు రావడంతో ప్రస్తుతం లండన్ లో తలదాచుకున్నాడు. కానీ ఆనాటి నుంచి నేటి దాకా అత్యంత జనాదరణ కలిగిన పొట్టి ఫార్మాట్ గా ఇది పేరు పొందింది. గతంలో ఎనిమిది జట్లు ఆడేవి. ఐపీఎల్ 15వ సీజన్ లో రెండు కొత్త జట్లు చేరాయి. అవి గుజరాత్ టైటాన్స్(GT) , లక్నో సూపర్ జెయింట్స్(LSG).
వచ్చీ రావడంతోనే గుజరాత్ రాజస్థాన్ రాయల్స్ ను మట్టి కరిపించింది. ఈసారి 16వ సీజన్ లో సీన్ మారింది. అనూహ్యంగా గుజరాట్ టైటాన్స్ మరోసారి ఫైనల్ కు చేరుకుంది. టైటిల్ కు కొద్ది దూరంలో నిలిచింది. విచిత్రం ఏమిటంటే చెన్నై వేదికగా జరిగిన క్వాలిఫైయర్ -1 లో చెన్నై చేతిలో ఓటమి పాలైంది. తిరిగి క్వాలిఫైయర్ -2లో ముంబైకి షాకిచ్చింది. ఫైనల్ లో చెన్నైతో ఢీకొనేందుకు రెడీ అయ్యింది.
కోట్లాది మంది అభిమానులు ధోనీ కోసం వేచి చూస్తున్నారు. ఎలాంటి సందర్భంలోనైనా మ్యాచ్ ను తన వైపు తిప్పుకునే సామర్థ్యం ఉంది. అందుకే అతడిని మిస్టర్ కూల్ అంటారు. ఇక హార్దిక్ పాండ్యా సామాన్యంగా ఓటమిని ఒప్పుకోడు. విజేతగా నిలవాలని అనుకుంటాడు. ఇద్దరి దిగ్గజ టీమ్ లు చివరి దాకా పోరాడేందుకు రెడీ అవుతాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మ్యాచ్ రసవత్తరంగా మారడం ఖాయం. మరి ధోనీ గెలుస్తాడా పాండ్యా నిలుస్తాడా అన్నది వేచి చూడాలి.
Also Read : MS Dhoni
