MS Narayana : తెలుగు సినిమా రంగంలో నవ్వుల రేడు ఎంఎస్ నారాయణ అలియాస్ మైలవరపు సూర్యనారాయణ. ఇవాళ ఆయన వర్దంతి. సరిగ్గా ఇదే రోజు ఇక సెలవంటూ వెళ్లి పోయారు.
కానీ ఆయన నటన, ఆహార్యం, భాష ఇప్పటికీ చెరిగి పోకుండా అలాగే ఉన్నాయి.
ఇవాళ్టితో ఆయన మరణించి ఏడేళ్లవుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రులో 1951 ఏప్రిల్ 16న పుట్టారు ఎంఎస్ నారాయణ(MS Narayana).
ఆయన చనిపోయే నాటికి వయసు 63 ఏళ్లు. భాషా ప్రవీణ చదివారు. వృత్తి రీత్యా అధ్యాపకుడిగా, రచయితగా, నటుడిగా, దర్శకుడిగా పేరు పొందారు.
ఆయనకు ఇద్దరు పిల్లలు. 17 సంవత్సరాల పాటు దాదాపు 700కు పైగా సినిమాల్లో నటించాడు. ఎందరో అభిమానుల్ని సంపాదించుకున్నారు.
ఆయన చదువుకునే రోజుల్లో హాస్య రచనలు చేశారు. కొన్ని నాటకాలు రాశడు. ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి దగ్గర కొంత కాలం పాటు రచయితగా పని చేశాడు.
ఆయన దర్శకత్వం వహించిన సినిమాల్లో నటించాడు ఎంఎస్ నారాయణ(MS Narayana). ఇక నటుడిగా ఆయనకు గుర్తింపు తీసుకు వచ్చేలా చేసింది మా నాన్నకి పెళ్లి. ఇందులో 1997లో వచ్చిన ఈ మూవీలో ఓ తాగుబోతు పాత్రలో నటించాడు.
ఆ తర్వాత అలాంటి పాత్రలే చాలా వచ్చాయి. నారాయణ – కొడుకు, భజంత్రీలు చిత్రాలకు దర్శకత్వం వహించాడు. గతంలో భీమవరంలో తెలుగు టీచర్ గా పని చేశాడు.
కథా రచయితగా ఎంఎస్ నారాయణకు గుర్తింపు తీసుకు వచ్చింది వేగు చుక్క పగటి చుక్క. మధ్య తరగతి రైతు కుటుంబం ఆయనది. చాలా కష్టపడి చదువుకున్నాడు.
పరుచూరి వద్ద ఎంఎస్ చేరారు. ఆయన జీవితంలో రచయితగా స్థిరపడేలా చేసింది. పరుచూరి గోపాలకృష్ణ ఆయనకు పెళ్లి చేశారు. కేజిఆర్ కాలేజీలో అధ్యాపకుడిగా పని చేశారు.
కళా రంగంపై ఆసక్తితో నటనా రంగంలోకి ఎంటర్ అయ్యాడు. ఆ తర్వాత రాజీనామా చేసి రచయితగా స్థిరపడ్డారు. ఎనిమిది చిత్రాలకు రచయితగా రాశాడు.
ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. 2015లో తన స్వంతూరికి సంక్రాంతికి అని వెళ్లి అక్కడే అస్వస్థతకు గురై తిరిగి రాని లోకాలకు వెళ్లి పోయారు ఈ నవ్వుల రేడు.
Also Read : ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ డిక్లేర్