MSK Prasad : బీసీసీఐ మాజీ సెలెక్షన్ కమిటీ చైర్మన్ , ప్రస్తుత కామెంటేటర్ ఎంఎస్కే ప్రసాద్(MSK Prasad) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల 2022లో భాగంగా గుజరాత్ టైటాన్స్ కు నాయకత్వం వహిస్తున్న హార్దిక్ పాండ్యా ఆట తీరుపై ప్రశంసల జల్లు కురిపించాడు.
అద్భుతమైన కెప్టెన్సీ ప్రతిభ కనబరుస్తున్నాడని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా తను సెలెక్షన్ చేసిన ఆటగాళ్లలో ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ వచ్చాడు పాండ్యాకు. భారత క్రికెట్ జట్టు తరపున ప్రాతినిధ్యం వహించాడు.
అద్భుతమైన ప్రతిభను కనబర్చాడు. కానీ గత ఏడాదిన్నర నుంచి హార్దిక్ పాండ్యా తన సహజ సిద్దమైన ఆట తీరును కోల్పోయాడు. తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు.
ఐపీఎల్ లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకోలేదు. కానీ ఈ విపత్కర పరిస్థితుల్లో ఊహించని రీతిలో గుజరాత్ టైటాన్స్ మేనేజ్ మెంట్ ఏకంగా తనను ఐపీఎల్ మెగా వేలంలో చేజిక్కించుకుంది.
తాజా, మాజీ ఆటగాళ్లే కాదు క్రికెట్ అభిమానులు సైతం విస్తు పోయేలా అతడికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. దీంతో పాండ్యాకు ఎందుకిచ్చారంటూ ప్రశ్నించారు.
కానీ మేనేజ్ మెంట్ తనపై నమ్మకం ఉంచినందుకు హార్దిక్ పాండ్యా కృతజ్ఞతలు కూడా తెలిపాడు. ఈ మేరకు ఆడిన రెండు మ్యాచ్ లలో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది.
ఎక్కడా తప్పులు దొర్లకుండా కూల్ గా నాయకుడిగా వ్యవహరించడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు ఎంఎస్కే ప్రసాద్(MSK Prasad). ప్రస్తుతం తను సూపర్ గా ఆడుతున్నాడంటూ కితాబు ఇచ్చాడు. ఇదిలా ఉండగా ఎంఎస్కే చేసిన కామెంట్స్ చర్చకు దారి తీశాయి.
Also Read : అద్భుతంగా ఆడాం కానీ ఓడి పోయాం