Mukesh Ambani : మాండ‌రీయ‌న్ ఓరియంట‌ల్ మ‌నోడిదే

కైవ‌సం చేసుకున్న ముఖేష్ అంబానీ

Mukesh Ambani : రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ చీఫ్ ముఖేష్ అంబానీ త‌న వ్యాపారాన్ని మ‌రింత విస్త‌రించే ప‌నిలో ప‌డ్డ‌ది. అన్ని రంగాల‌లో త‌న‌దైన ముద్ర ఉండాల‌న్న‌దే ఆయ‌న ఆకాంక్ష‌.

ఇప్ప‌టికే టెలికాం, ఆయిల్, జ్యూవెల‌రీ, ఫ్యాష‌న్, రిటైలింగ్ ఇలా ప్ర‌తి దానిలోనూ విస్త‌రిస్తున్నారు. ఇప్ప‌టికే లండ‌న్ స్టోక్ పార్క్ ఎస్టేట్ ను కొనుగోలు చేశాడు ముఖేష్ అంబానీ.

తాజాగా అమెరికాలోని న్యూయార్క్ లో కొలువు తీరిన ల‌గ్జ‌రీ హోట‌ల్ మాండ‌రీయ‌న్ ఓరియంట‌ల్ ను కొనుగోలు చేశారు. ఈ మేర‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ విష‌యం ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది.

ద‌క్షిణ ఆసియా దేశాల ప‌రంగా చూస్తే అత్యంత ధ‌న‌వంతుల జాబితాలో ముఖేష్ అంబానీ(Mukesh Ambani) టాప్ లో కొన‌సాగుతున్నాడు. మాండ‌రీయ‌న్ ఓరియంట‌ల్ 73.37 శాతం స్టేక్ తో 98.15 మిలియ‌న్లు వెచ్చించి కొనుగోలు చేశాడు.

ఇందులో అత్య‌ధికంగా వాటా క‌లిగి ఉన్న కేమాన్ ఐలాండ్స్ షేర్ ను కొనుగోలు చేశాడు ముఖేష్ అంబానీ. దీంతో ఈ హోట‌ల్ అత‌డి స్వంత‌మైంది.

న్యూయార్క్ సిటీకే త‌ల‌మానికంగా నిలిచింది ఈ మాండ‌రీయ‌న్ ఓరియంట‌ల్ హోట‌ల్. 2003లో ఇది ప్రారంభ‌మైంది. ప్ర‌పంచ ప్ర‌సిద్ది చెందిన హోట‌ళ్ల‌లో ఇది ఒక‌టిగా పేరు పొందింది.

ఆతిథ్య సేవా రంగాల‌లో ప‌లు అవార్డులు సొంతం చేసుకుంది. దీనిని కొనుగోలు చేయ‌డం వ‌ల్ల రిల‌య‌న్స్ ఆస్తులు కూడా పెరిగాయి.

ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే రిల‌య‌న్స్ సంస్థ ఒబెరాయ్ హోట‌ల్స్ , స్టేల్ ఆఫ్ ది ఆర్ట్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్, ఇత‌ర ఆస్తుల‌ను కొనుగోలు చేసింది.

Also Read : ఎస్బీఐ క‌స్ట‌మ‌ర్ల‌కు తీపి క‌బురు

Leave A Reply

Your Email Id will not be published!