Mukesh Ambani Top : ఆదాయంలో అంబానీ ముందంజ
గౌతం అదానీ వెనుకంజ
Mukesh Ambani Top : అమెరికా రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఆ సంస్థ కొట్టిన షాక్ కు కోలుకోలేని నష్టాలకు గురైంది అదానీ గ్రూప్. భారీ ఎత్తున నష్టం వాటిల్లింది. నిన్నటి దాకా ప్రపంచ కుబేరుల్లో మూడవ స్థానంలో ఉన్న అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ ఉన్నట్టుండి 11వ స్థానానికి పడి పోయాడు.
ఈ దెబ్బకు మరో భారతీయ వ్యాపారవేత్త రిలయన్స్ ముకేష్ అంబానీ అదానీని దాటేశాడు(Mukesh Ambani Top). ప్రస్తుతం 84.3 బిలియన్ డాలర్ల సంపదతో అంబానీ ప్రపంచం లోనే సంపన్నుడైన భారతీయుడిగా అవతరించారు. ఇదిలా ఉండగా గౌతమ్ అదానీ ఆదాయం 83.9 బిలియన్ డాలర్ల సంపదతో కిందకు పడిపోయారు.
అంబానీ సంపద 0.19 శాతం వృద్దితో 164 మిలియన్ డాలర్లు పెరగగా అదే సమయంలో గౌతం అదానీ సంపద 4.62 శాతం నష్టంతో 84.1 బిలియన్ డాలర్లు కరిగి పోయిందంటూ ప్రపంచ సంస్థ ఫోర్బ్స్ వెల్లడించింది. ఆండర్సన్ సారథ్యంలోని హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ సంచలన నివేదిక వెల్లడించింది.
తప్పుడు లెక్కలతో ఇన్వెస్టర్లను మోసం చేస్తోంది అంటూ కుండ బద్దలు కొట్టింది. గౌతం అదానీ కంటే ముందంజలో ఉండడం విస్తు పోయేలా చేసింది. చివరకు అదానీని దాటేసి ముందుకు దూసుకు వెళ్లడం వ్యాపార వర్గాలలో చర్చకు దారి తీసేలా చేసింది. బెర్నార్డ్ ఆర్నాల్డ్ ఫోర్డ్స్ కుబేరుల జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్నారు.
ఎలోన్ మస్క్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ , ఎల్లిసన్ , వారెన్ బఫెట్ , బిల్ గేట్స్ , తర్వాతి స్థానంలో ఉన్నారు.
Also Read : ప్రజలందరికీ అనువైన బడ్జెట్ – మోదీ