Mukesh Ambani : ముకేశ్ అంబానీ మరోసారి టాప్ లోకి దూసుకు వెళ్లాడు. బ్లూంబర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ లిస్టులో ధనవంతుడిగా ఉన్న అదానీ గ్రూప్ సంస్థ చైర్మన్ గౌతమ్ అదానీని నెట్టి వేసి మరోసారి తన స్థానంలోకి వచ్చేశాడు ముకేశ్ అంబానీ.
మార్కెట్ లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ముకేశ్ సంస్థ వాల్యూ పెరిగింది. ఇద్దరి సంపదలో తేడాలు వచ్చాయి. దీంతో ముకేశ్ అంబానీ(Mukesh Ambani టాప్ కు చేరుకున్నారు.
ప్రపంచ అత్యధిక సంపన్నుల జాబితాలో గౌతమ్ అదాన ఆసియాలో రెండో స్థానంలో ఉంటే వరల్డ్ వైడ్ గా 11వ ప్లేస్ కు పరిమితమై పోయారు.
ఇవాళ బ్లూంబర్గ్ ఇండెక్స్ లిస్టులో రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఆస్తి 89.2 బిలియన్ డాలర్లుగా నమోదు చేసింది. అయితే ఒక రోజు తేడాలో 87.9 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
ఇదిలా ఉండగా గౌతమ్ అదానీ మొత్తం ఆదాయం 86.3 బిలియన్ డాలర్ల వద్ద నిలిచి పోయింది. అయితే నిన్నటి ఒక్క రోజులో 88.5 గా ఉండింది. దీంతో ఇద్దరి దిగ్గజ సంస్థల ఆస్తుల విలువలో తేడా వచ్చింది.
ముకేశ్ ఆదాయం సంపద 1.33 బిలియన్ డాలర్లు చేరుకున్నాయి. ఇక గౌతమ్ అదానీ ఖాతా నుంచి రూ. 2.16 బిలియన్ డాలర్లు ఆరి పోయాయి.
దీంతో నెంబర్ 1 స్థానంతో పాటు కుబేరుల్లో పదో స్థానానికి మరోసారి చేరుకోవడం ముకేశ్(Mukesh Ambani) కు కొంత ఆనందాన్ని ఇచ్చింది. ఏది ఏమైనా ఇద్దరు దిగ్గజాలు ఆస్తులు పెరిగినా దేశంలో పేదరికం మాత్రం తగ్గడం లేదు.
Also Read : ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ లో జాబ్స్