Sarita Mali : పూలమ్మింది పీహెచ్డీ చదువుతోంది
చరిత్ర సృష్టించిన ముంబై ఫ్లవర్ సెల్లర్
Sarita Mali : ఎవరీ సరితా మాలి అనుకుంటున్నారా. ఒకప్పుడు ముంబై వీధుల్లో పూలు అమ్మింది. కానీ కష్టాలు అధిగమించి తనను తాను
విద్యార్థినిగా ప్రూవ్ చేసుకుంది. ఏకంగా అమెరికాలో పేరొందిన యూనివర్శిటీలో పీహెచ్ డీ కోసం అడ్మిషన్ పొందింది.
సరితా మాలి ప్రస్తుతం జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలోని భారతీయ భాషా కేంద్రంలో హిందీ సాహిత్యంలో పీహెచ్ డీ చేస్తోంది.
ఆమె జేఎన్ యూ నుంచి ఎంఏ, ఎంఫిఎల్ డిగ్రీలు పొందింది.
వచ్చే జూలైలో సరితా మాలి తన పీహెచ్ డీకి సంబంధించి థీసిస్ సమర్పించనుంది. ఇదిలా ఉండగా జెఎన్ యూలో అతి పిన్న వయసు కలిగిన విద్యార్థులలో సరితా మాలి (Sarita Mali) ఒకరు.
ఒకప్పుడు ముంబై వీధుల్లో పూల దండలు అమ్ముతూ తండ్రికి తోడుగా నిలిచింది ఆమె. వయసు 28 ఏళ్లు ఉన్నాయి. ప్రస్తుతం అమెరికా లోని కాలిఫోర్నియా యూనివర్శిటీలో పీహెచ్ డీ కోసం అడ్మిషన్ పొందుతోంది.
ఈ సందర్భంగా సరితా మాలి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు, కన్నీళ్లు ఉంటాయి. ఇది సహజం. చెప్పలేని బాధ కూడా ఉంటుంది. కానీ మనం నడిచే దారి ఏదైనా కానీ గమ్యం గొప్పదైతే ఇవన్నీ చిన్నవిగా కనిపిస్తాయని అంటోంది.
దురదృష్టవశాత్తు నేను ఇక్కడ జన్మించడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఎన్నో ఇబ్బందులు అనుభవించా. నేను తండ్రితో కలిసి పూలు
అమ్మినప్పుడు బాధ పడలేదు. ఒక గొప్ప అనుభవంగా తాను భావిస్తున్నట్లు చెప్పింది సరితా మాలి(Sarita Mali) .
పండుగలు పండుగల సమయంలో పూలు అమ్మేది. తండ్రితో కలిసి పని చేసేది. కరోనా వాళ్లను మరింత ఇబ్బందులకు గురి చేసింది.
ఆమె జీవితంలో పూలు తప్ప ఇంకేదీ కనిపించ లేదు. సరితా మాలి కుటుంబంలో ఆరు మంది.
జౌన్ పూర్ లోని బద్లాపూర్ కు కరోనా కారణంగా వెళ్లారు. అలా కష్టపడి చదువుతూ అన్ని అడ్డంకులను అధిగమిస్తూ దేశంలో పేరొందిన
జేఎన్ యూ లోకి ఎంటర్ అయ్యింది. కష్టపడింది.
2014లో మాస్టర్స్ కోసం జేఎన్ యుకి ఎంపికైంది. ఇక్కడికి వచ్చాక ఏదైనా సాధించ గలనన్న నమ్మకం ఏర్పడిందని సరితా మాలి అంటోంది.
ఎంఫిల్ లో చేరినప్పుడు నా వయసు 22 ఏళ్లు. ఏది ఏమైనా ఆమె ఈ దేశంలో ఉన్న అణగారిన వర్గాలకు ఒక ఆలంబన. కష్టపడితే ఎంత
దాకా అయినా చేరవచ్చని నిరూపిస్తోంది.
Also Read : జస్టిస్ రమణ నోట జవాద్ జైదీ కవిత్వం