MI vs DC IPL 2022 : ముంబై దెబ్బ‌కు ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఔట్

బెంగ‌ళూరుకు అంది వ‌చ్చిన అదృష్టం

MI vs DC IPL 2022 : ఐపీఎల్ 2022లో ఆస‌క్తికర ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. నిన్న‌టి దాకా పేల‌వ‌మైన ప‌ర్ ఫార్మెన్స్ తో తీవ్ర నిరాశ ప‌ర్చిన ముంబై ఇండియ‌న్స్ ఆఖ‌రి 14వ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ కు చుక్క‌లు చూపించింది.

త‌న‌ను ప్లే ఆఫ్స్ కు వెళ్ల‌కుండా అడ్డుకున్నందుకు ప్ర‌తీకారం తీర్చుకుంది. నువ్వా నేనా అన్న రీతిలో ఇరు జ‌ట్ల మ‌ధ్య పోటీ సాగింది.

చివ‌ర‌కు ముంబై(MI vs DC IPL 2022) దెబ్బ‌కు ఠారెత్తి పోయింది ఢిల్లీ క్యాపిటల్స్.

దీంతో టోర్నీలో ప్లే ఆఫ్స్ కోసం జ‌రిగిన ఈ కీల‌క పోటీలో ఢిల్లీ ఆశ‌ల‌పై నీల్లు చల్లింది. దీంతో అదృష్టం రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగళూరు

ద‌ర్జాగా ప్లే ఆఫ్స్ కు చేరింది.

ఇప్ప‌టికే గుజ‌రాత్ టైటాన్స్ , రాజ‌స్తాన్ రాయ‌ల్స్ , ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ , ఆర్సీబీ చేరుకున్నాయి. ఐపీఎల్ టోర్నీ చివ‌రి అంకానికి చేరుకుంది.

ఒక ర‌కంగా ముంబై ప‌రోక్షంగా ఆర్సీబీకి మ‌ద్ద‌తు ఇచ్చిన‌ట్టే. మొద‌ట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ పేల‌వ‌మైన ఆట తీరుతో నిరాశ ప‌రిచింది. నిన్న‌టి

దాకా దుమ్ము రేపిన ఆసిస్ స్టార్ హిట్ట‌ర్ డేవిడ్ వార్న‌ర్ ఈసారి చేతులెత్తేశాడు.

ఇక కెప్టెన్ సంగ‌తి స‌రేస‌రి. ఫీల్డింగ్ లో చేసిన పొర‌పాట్ల‌తో పాటు కెప్టెన్ పంత్ అనుభ‌వ రాహిత్యం కూడా ఆ జ‌ట్టును కొంప ముంచింది.

ప్లే ఆఫ్స్ కు చేరాలంటే తప్ప‌నిస‌రిగా గెల‌వాల్సిన మ్యాచ్ ను చేజేతులారా పోగొట్టుకుంది ఢిల్లీ క్యాపిట‌ల్స్.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే ఢిల్లీ 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్ఓయి 159 ప‌రుగులు చేసింది. రావ్ మ‌న్ పావెల్ 34 బంతులు ఆడి 43 ప‌రుగులు చేశాడు. ఇందులో ఒక ఫోర్ 4 సిక్స‌ర్లు ఉన్నాయి.

పంత్ 33 బంతులు ఆడి 39 ర‌న్స్ చేశాడు. ఇక ముంబై(MI vs DC IPL 2022) బౌల‌ర్ల‌లో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మూడు వికెట్లు ప‌డ‌గొట్టి విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. అనంత‌రం బ‌రిలోకి దిగిన ముంబై చివ‌రి దాకా పోరాడింది.

19.1 ఓవ‌ర్ల‌లో 160 ప‌రుగులు చేసి జ‌య‌కేత‌నం ఎగుర వేసింది. ఒకానొక ద‌శ‌లో జ‌ట్టు ఓడి పోతుంద‌ని అనుకున్న స‌మ‌యంలో ఢిల్లీకి చుక్క‌లు చూపించాడు టిమ్ డేవిడ్. రోహిత్ శ‌ర్మ 2 ప‌రుగుల‌కే వెనుదిరిగితే ఇషాన్ కిష‌న్ 35 బంతులు ఆడి 48 ప‌రుగులు చేశాడు.

ఇందులో 3 ఫోర్లు 4 సిక్స‌ర్లు ఉన్నాయి. బేవిస్ 37 ర‌న్స్ చేస్తే , హైద‌రాబాద్ కుర్రాడు తిల‌క్ వ‌ర్మ స‌త్తా చాట‌గా ఆఖ‌రులో వ‌చ్చిన డేవిడ్ దంచి కొట్ఆడు. 11 బంతులు ఆడి 2 ఫోర్లు 4 సిక్స‌ర్లతో 34 ర‌న్స్ చేశాడు. దీంతో ఢిల్లీ ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది.

Also Read : ఢిల్లీ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లిన టిమ్ డేవిడ్

Leave A Reply

Your Email Id will not be published!