RR vs MI : విజయాల బాట పట్టిన సంజూ శాంసన్ కెప్టెన్సీలోని రాజస్థాన్ రాయల్స్ కు బ్రేక్ వేసింది రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్. ముంబై (RR vs MI)వేదికగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ పూర్తిగా ఉత్కంఠకు దారి తీసింది.
చివరి దాకా పోరాడింది రాజస్థాన్. ఈ పిచ్ పై పరుగులు చేయడం కష్టంగా మారింది. ఇక ముంబై ఇండియన్స్(RR vs MI) ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్ లలో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ తో బోణీ కొట్టింది.
ఆ జట్టు ప్లే ఆఫ్స్ కు వెళ్లేందుకు ఎలాంటి ఆస్కారం లేదు. కానీ పోయిన పరువు నిలబెట్టుకునేందుకు ముంబై ఆటగాళ్లు ప్రయత్నం చేశారు. ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ఛేదించింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 158 పరుగులు మాత్రమే చేసింది. మరోసారి జోస్ బట్లర్ మెరిశాడు. మళ్లీ చెత్త షాట్ ఆడబోయి వికెట్ పారేసుకున్నాడు సంజూ శాంసన్. చివర్లో ఆశించిన మేర రాణించ లేక పోయాడు సిమ్రాన్ హిట్ మైర్.
ఇక ముంబై ఇండియన్స్ జట్టులో సూర్య కుమార్ యాదవ్ తో పాటు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ రాణించారు. సూర్య భాయ్ 51 రన్స్ చేస్తే తిలక్ 35 రన్స్ చేశాడు.
ఆఖరులో టిమ్ డేవిడ్ , డేనియల్ సామ్స్ మ్యాచ్ ను ఈజీగా ముగించేశారు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ లో జోస్ బట్లర్ 67 రన్స్ చేశాడు. అశ్విన్ 21 రన్స్ మినహా ఇంకెవరూ రాణించ లేక పోయారు.
Also Read : గుజరాత్ ధనా ధన్ బెంగళూరు పరేషాన్