Mumbai Indians : ముంబై ఇండియన్స్ ఇక ఇంటికే
ప్లే ఆఫ్స్ ఆశలు కష్టమే
Mumbai Indians : ఇది ఊహించని పరిణామం. 2008లో ప్రారంభమైంది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) . ఇప్పటి దాకా 14 సీజన్లు ముగిశాయి. ప్రస్తుతం ముంబై వేదికగా 15వ సీజన్ ఆఖరి అంకానికి చేరింది. గత సీజన్లలో 8 జట్లు ఆడగా ఈసారి కొత్తగా 2 జట్లు చేరాయి.
గుజరాత్ టైటాన్స్ , లక్నో సూపర్ జెయింట్స్ (Mumbai Indians)అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంటున్నాయి.
గుజరాత్ కు హెడ్ కోచ్ గా ఆశిష్ నెహ్రా ఉండగా లక్నోకు స్టార్ హిట్టర్ గౌతం గంభీర్ ఉన్నాడు.
ఇప్పటికే 12 మ్యాచ్ లు ఆడిన గుజరాత్ 9 మ్యాచ్ లలో గెలుపొంది 18 పాయింట్ల సాధించి దర్జాగా ప్లే ఆఫ్స్ చేరింది. ఇక లక్నో సెకండ్ ప్లేస్ లో ఉంది.
మిగతా ప్లే ఆఫ్స్ కోసం రాజస్తాన్ , ఢిల్లీ, పంజాబ్ , కోల్ కతా, బెంగళూరు తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నాయి.
ఇక ముంబై ఇండియన్స్(Mumbai Indians) ఐపీఎల్ లో 5 సార్లు విజేతగా నిలిచింది. కానీ గత ఏడాతి ప్లే ఆఫ్స్ కు వెళ్లలేదు.
ఈసారి కూడా అత్యంత పేలవమైన ప్రదర్శనతో తీవ్ర నిరాశకు లోను చేసింది.
ఇక ముంబై ఇండియన్స్ ఇప్పటి దాకా 11 మ్యాచ్ లు ఆడింది. 9 మ్యాచ్ లలో ఓడి పోయింది.
రాజస్థాన్ రాయల్స్ , గుజరాత్ టైటాన్స్ ను మాత్రమే ఇప్పటి వరకు ఓడించింది.
ఇంకా మూడు మ్యాచ్ లు ఆడాల్సి ఉన్నా ప్లే ఆఫ్స్ కు చేరుకునేది చాలా కష్టం.
కనీసం 16 పాయింట్లు రావాల్సి ఉంటుంది. ఈ మూడు గెలిచినా 10 పాయింట్లు మాత్రమే వస్తాయి.
ఇక ప్లే ఆఫ్స్ ఆశలు పూర్తిగా అడుగంటి పోయినట్లే. ఇక పెట్టే బేడా సర్దుకుని ఇంటికి వెళ్లి పోవడమే మిగిలి ఉంది. భారతజట్టుకు నాయకత్వం వహిస్తున్న రోహిత్ శర్మ ఇప్పుడు ముంబైకి స్కిప్పర్.
Also Read : సత్తా చాటిన శుభ్ మన్ గిల్