Mumbai Indians : క‌థ కంచికి ముంబై ఇక ఇంటికే

చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌తో చేతులెత్తేశారు

Mumbai Indians : ప్ర‌పంచంలోనే టాప్ రిచ్ లీగ్ గా పేరొందిన ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్ ) 2022లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నువ్వా నేనా అన్న రీతిలో కొన్ని మ్యాచ్ లు కొన‌సాగితే మ‌రికొన్ని ఏక‌ప‌క్షంగా జ‌రుగుతున్నాయి.

ఇదంతా ప‌క్క‌న పెడితే ఐపీఎల్ లో సుదీర్ఘమైన , బ‌ల‌మైన జ‌ట్టుగా పేరొందింది ముంబై ఇండియ‌న్స్(Mumbai Indians). ఆ జ‌ట్టు బ‌లం బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్.

ఎందుక‌నో వేలం పాట‌లో స‌రైన ఆట‌గాళ్ల‌ను ఎంపిక చేసుకోక పోవ‌డం కూడా ఆ జ‌ట్టు పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌కు కార‌ణంగా తోస్తోంది.

ఇటీవ‌ల ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 12, 13ల‌లో బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ మెగా వేలంలో కొంద‌రినే తీసుకుంది.

ఇక దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన 2021 ఐపీఎల్ లో ప్లే ఆఫ్స్ కు చేర‌కుండానే చేతులెత్తేసింది. ఇక ఈసారి మ‌రోసారి టైటిల్ ఫెవ‌రేట్ గా బ‌రిలోకి దిగింది.

ఆ జ‌ట్టుకు భార‌త జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హిస్తున్న హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ కెప్టెన్ గా ఉన్నాడు.

త‌న సార‌థ్యంలోనే ముంబై ఇండియ‌న్స్ (Mumbai Indians)ప‌లు సార్లు ఐపీఎల్ టైటిల్ కైవ‌సం చేసుకుంది.

కానీ ఈసారి కెప్టెన్ గా రాణించ లేక పోయాడు రోహిత్ శ‌ర్మ‌. త‌నే కాదు ఇత‌ర ఆట‌గాళ్లలో కొంద‌రు మాత్ర‌మే స‌త్తా చాటారు.

జ‌ట్టు ప‌రంగా చూస్తే పైకి బాగానే ఉన్నా ఏకంగా 7 మ్యాచ్ ల‌లో వ‌రుస‌గా ఓడి పోయింది. హైద‌రాబాద్ కు చెందిన తిల‌క్ వ‌ర్మతో పాటు ఇషాన్ కిష‌న్ , డెవాల్ట్ బ్రెవిస్ మెరిశారు.

ర‌మ‌ణ్ దీప్ సింగ్, రాహుల్ బుద్ది, అర్ష‌ద్ ఖాన్ , సూర్య కుమార్ యాద‌వ్ , పొలార్డ్ , బుమ్రా, థంపి లాంటి స్టార్ ఆట‌గాళ్లు ఉన్నారు. వీరితో పాటు జోఫ్రా ఆర్చ‌ర్ , డానియ‌ల్ సామ్స్ ఉన్నారు.

జ‌య‌దేవ్ ఉనాద్క‌త్ , మ‌యాంక్ మార్కెండే, టిమ్ డేవిడ్ ఉన్నా ఫ‌లితం లేకుండా పోయింది..

Also Read : స‌మ ఉజ్జీల స‌మ‌రానికి వేళాయె

Leave A Reply

Your Email Id will not be published!