Mumbai Indians Retention : భారీ ఎత్తున వ‌దులుకున్న ముంబై

13 మంది ఆట‌గాళ్ల‌కు మంగ‌ళం

Mumbai Indians Retention : ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2023కి సిద్దం అవుతున్న త‌రుణంలో మోస్ట్ టైటిల్ ఫెవ‌రేట్ గా ఉంటూ వ‌చ్చింది ముంబై ఇండియ‌న్స్. ప్ర‌స్తుత భార‌త జ‌ట్టుకు స్కిప్ప‌ర్ గా ఉన్న హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ ఈ జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

విచిత్రం ఏమిటంటే అత్యంత స‌క్సెస్ ఫుల్ కోచ్ గా పేరొందిన శ్రీ‌లంక స్టార్ మాజీ క్రికెట‌ర్ మ‌హేళ జ‌య‌వ‌ర్ద‌నే కొన్నేళ్లుగా ఆ జ‌ట్టుకు శిక్ష‌కుడిగా ఉన్నాడు. ఎన్నో కీల‌క మార్పులు చేశాడు.

కానీ గ‌త రెండేళ్లుగా ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు ఆశించిన మేర ప్ర‌తిభ క‌న‌బ‌ర్చ‌డం లేదు. ఈ జ‌ట్టుకు అత్యంత బ‌ల‌మైన వ్యాపార సంస్థ రిల‌య‌న్స్ గ్రూప్ కు చెందింది. చేతిలో కోట్ల రూపాయ‌లు ఉన్నా ఎందుక‌నో ఆ జ‌ట్టు స్థిర‌మైన ఆట తీరును క‌న‌బ‌ర్చ‌డం లేదు. విండీస్ దిగ్గ‌జ ఆట‌గాడు బ్రియాన్ లారా ను ఎంపిక చేసింది ఆ టీమ్.

అత‌డి సార‌థ్యంలో జ‌ట్టు గెలుపొందుతుంద‌ని ఆశిస్తోంది. ఇందులో భాగంగానే ముంబై ఇండియ‌న్స్ లో కీల‌క మార్పులు చేశాడు. ఏకంగా 13 మంది ఆట‌గాళ్ల‌ను వ‌దులుకుంది. ఇది ఒక ర‌కంగా విస్తు పోయేలా చేసింది. కేకేఆర్ 16 మందిని, ఆర్ఆర్ 9 మందిని విడిచి పెట్టింది.

జ‌ట్టు ప‌రంగా రోహిత్ శ‌ర్మ కెప్టెన్ కాగా టిమ్ డేవిడ్, ర‌మ‌ణ్ దీప్ సింగ్, తిల‌క్ వ‌ర్మ‌, సూర్య కుమార్ యాద‌వ్ , ఇషాన్ కిషన్ , స్ట‌బ్స్ , డెవాల్ట్ , బ్రీవిస్ , జోఫ్రా ఆర్చ‌ర్ , బుమ్రా, అర్జున్ టెండూల్క‌ర్ , అర్ష‌ద్ ఖాన్ , కుమార్ కార్తికేయ‌, హృతిక్ షోకీన్ , జాస‌న్ బెహ్రాండ‌ర్స్ , ఆకాష్ మ‌ధ్వ‌ల్ ను(Mumbai Indians Retention) రిటైన్ చేసుకుంది.

ఇక వ‌దులుకున్న వారిలో కీర‌న్ పోలార్డ్ , ప్రీత్ సింగ్ , ఆర్య‌న్ జుయ‌ల్, థంపి, డేనియ‌ల్ సామ్స్ , ఫాబియ‌న్ అలెన్ , ఉనాద్క‌త్ , మ‌యాంక్ మార్కండే, మురుగ‌న్ అశ్విన్ , రాహుల్ బుద్ది, రిలే మెరిడిత్ , సంజ‌య్ యాద‌వ్ , టైమ‌ల్ మిల్స్ ను విడుద‌ల చేసింది.

Also Read : కేన్..పూరన్ కు స‌న్ రైజ‌ర్స్ దెబ్బ

Leave A Reply

Your Email Id will not be published!