Mumbai Police Records : సల్మాన్ ఖాన్ వాంగ్మూలం నమోదు
చంపేస్తామంటూ బెదిరింపు లేఖపై కేసు
Mumbai Police Records : కొందరు గుర్తు తెలియని దుండగులు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తో పాటు ఆయన తండ్రి సలీం ఖాన్ ను చంపి వేస్తామంటూ బెదిరింపు లేఖను ఇంటి వద్ద వదిలి వెళ్లారు. ఈ లేఖ వచ్చిన విషయంపై సల్మాన్ ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గతంలో కోర్టు ఆవరణలోనే గ్యాంగ్ లీడర్ , తీహార్ జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ సల్మాన్ ఖాన్ ను చంపి వేస్తానంటూ ప్రకటించాడు.
అప్పట్లో కలకలం రేపింది. ఇదే సమయంలో ఆ బెదిరింపు లేఖలో ఇటీవల పంజాబ్ లో దారుణ హత్యకు గురైన ప్రముఖ గాయకుడు సిద్దూ మూసే వాలాకు పట్టిన గతే నీకు పడుతుందని హెచ్చరించారు.
దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. మహారాష్ట్ర ప్రభుత్వం సల్మాన్ ఖాన్ కు మరింత భద్రతను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
తాజాగా షూటింగ్ నిమత్తం హైదరాబాద్ కు బయలు దేరే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో వాంగ్మూలం (స్టేట్ మెంట్ ) తీసుకున్నారు. ఈ విషయాన్ని పోలీసులు కూడా ధ్రువీకరించారు.
బెదిరింపు లేఖ ఎవరైనా ఇచ్చారా లేక వదిలి వెళ్లారా. అంతకు ముందు మీకు ఏవైనా ఫోన్ కాల్స్ వచ్చాయా, ఎవరి మీదనైనా మీకు అనుమానం ఉందా అన్న కోణంలో సల్మాన్ ఖాన్ ను ప్రశ్నించారు.
విచారణకు సంబంధించి నటుడు సల్మాన్ ఖాన్ తో పాటు తండ్రి , ప్రముఖ స్క్రీన్ ప్లే రచయిత సలీం ఖాన్ స్టేట్ మెంట్ ను రికార్డు(Mumbai Police Records) చేశారు. కాగా ముంబైలోని సబర్బన్ బాంద్రా లోని నటుడి నివాసం చుట్టూ పోలీసులు భద్రతను పెంచారు.
Also Read : రెహమాన్ ఎవరికీ లొంగడు – పార్తీపన్