Munawar Faruqui : బెంగ‌ళూరులో మునావ‌ర్ ఫ‌రూఖీ షో ర‌ద్దు

మ‌రోసారి ర‌ద్ద‌యిన స్టాండ్ అప్ కామెడీ షో

Munawar Faruqui : ప్ర‌ముఖ స్టాండ్ అప్ షో క‌మెడియ‌న్ మునావ‌ర్ ఫ‌రూఖీకి బిగ్ షాక్ త‌గిలింది. గ‌తంలో ఆయ‌న త‌న షోను నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు బెంగ‌ళూరులో.

కానీ పోలీసులు అడ్డు త‌గిలారు. దానిని హిందూత్వ సంస్థ‌లు అడ్డుకున్నాయి. ఇదే స‌మ‌యంలో మ‌రోసారి షోను నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేశారు.

అయితే నిర్వామ‌కులు ప‌ర్మిష‌న్ తీసుకోక పోవ‌డంతో ఈవెంట్ ను ర‌ద్దు చేసిన‌ట్లు బెంగ‌ళూరు పోలీసులు తెలిపారు. మునావ‌ర్ ఫ‌రూఖీ షో నిర్వ‌హించ‌డం వ‌ల్ల భ‌ద్ర‌తా స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌తాయి.

ఇప్ప‌టికే రాష్ట్రంలో ప‌లు చోట్ల తీవ్ర ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకున్నాయి. ఇది సున్నిత‌మైన అంశం, వ్య‌వ‌హారం. అందుకే ముందు జాగ్ర‌త్త‌గా కామెడీ షోను నిర్వ‌హించేందుకు వీలు లేద‌ని స్ప‌ష్టం చేశామ‌ని స్ప‌ష్టం చేశారు.

అయితే శ‌నివారం బెంగ‌ళూరులో డోంగ్రీ టు నో వేర్ షో పేరుతో ప్లాన్ చేశాడు మునావ‌ర్ ఫ‌రూఖీ. ఇదిలా ఉండ‌గా హాస్య న‌టుడు , నిర్వాహ‌కుల‌పై జై శ్రీ‌రామ్ సేన అనే సంస్థ బెంగ‌ళూరు పోలీస్ క‌మిష‌న‌ర్ సీహెచ్ ప్ర‌తాప్ రెడ్డికి ఫిర్యాదు చేసింది.

కోట్లాది భార‌తీయుల‌కు ఆద‌ర్శ ప్రాయంగా ఉంటూ , నిత్యం కొలిచే శ్రీ‌రాముడు, సీతా దేవిపై అవ‌మాన‌క‌ర‌మైన రీతిలో మునావ‌ర్ ఫ‌రూఖీ(Munawar Faruqui) అవ‌మానించాడ‌ని వారు ఆరోపంచారు.

అంతే కాకుండా ఫ‌రూఖీ త‌న షోల‌లో హిందూవుల మ‌నో భావాల‌ను దెబ్బ తీశారంటూ స‌ద‌రు సంస్థ త‌న ఫిర్యాదులో ఆరోపించింది. గ‌త ఏడాది 2021 న‌వంబ‌ర్ లో అదే మైదానంలో ఇక్క‌డ ప్ర‌ద‌ర్శ‌న ఇచ‌చ్చేందుకు హాస్య న‌టుడికి ప‌ర్మిష‌న్ ద‌క్క‌లేదు.

Also Read : రూ. 10 కోట్ల తో డైమండ్స్ భారీ గిఫ్ట్స్

Leave A Reply

Your Email Id will not be published!