Munugodu By Poll Comment : మునుగోడులో మునిగేదెవ్వరు
త్రిముఖ పోరులో జెండా ఎవరిదో
Munugodu By Poll Comment : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం మునుగోడు. ఈ ప్రాంతానికి
ఘణమైన చరిత్ర ఉంది. ఇక్కడ ఎక్కువసార్లు వామపక్షాల అభ్యర్థులు గెలుపొందారు.
ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వరుసగా గెలుస్తూ తన పట్టు నిలుపుకుంది. ఒక్కసారి మాత్రమే టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచాడు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం
వహిస్తున్న రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి గుడ్ బై చెప్పారు.
అమిత్ షా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఇక్కడ ఆయనే బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉండనున్నారు. ఆర్థికంగా, రాజకీయంగా బలమైన
వ్యక్తిగా పేరొందారు. కాగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది.
ఒక రకంగా చెప్పాలంటే కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఇక్కడ మంచి పట్టుంది. కానీ ఎక్కువగా బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకు ఉంది. ప్రస్తుతం ఎన్నికల వాతావరణం నెలకొంది.
తాజాగా అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ , బీజేపీ ఇక్కడ తమ పార్టీలను నిలబెట్టనున్నాయి. ఆయా పార్టీలతో పాటు బీఎస్పీ, తెలంగాణ వైఎస్ పార్టీ కూడా బరిలో ఉండనున్నాయి.
కానీ ఎవరు గెలిచినా తమకు ఒరిగింది ఏమిటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా ఎవరు ఎంత ఎక్కువ ఇస్తే వారి వైపు ఓట్లు వేసే చాన్స్ ఉంది.
దుబ్బాకతో పాటు హుజూరాబాద్(Munugodu By Poll) లో బీజేపీ విజయ డంకా మోగించింది.
ఇప్పుడు కూడా తాము సత్తా చాటుతామని తెలంగాణలో తామే పాగా వేస్తామని అంటోంది కాషాయ పార్టీ. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత
సమస్యలతో అట్టుడుకుతోంది.
ఇప్పటికే కోమటిరెడ్డి ప్రచార కమిటీ చైర్మన్ గా ఉండగా మరో వైపు సోదరుడు బీజేపీ వైపు నిలడుతుండడంతో ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
అయితే టీఆర్ఎస్ వల్ల రాష్ట్రం, బీజేపీ వల్ల దేశం నాశనమైందని కాంగ్రెస్ అంటోంది. ప్రభుత్వ ఆస్తులను మోదీ అమ్ముతుంటే కల్వకుంట్ల కుటుంబం
పూర్తిగా అవినీతి, అక్రమాలకు కేరాఫ్ గా మారిందంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
ఈ తరుణంలో ఎవరు గెలిచినా ఒరిగేది ఏమీ ఉండదని మరికొందరు అంటున్నారు. బీసీలు కీలకమైన ఓటు బ్యాంకుగా ఉన్నారు. కాగా బీజేపీ, టీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని కాంగ్రెస్ అంటోంది.
మరో వైపు కాంగ్రెస్ నుంచి గెలిస్తే అది టీఆర్ఎస్ కు అమ్ముడు పోతుందని బీజేపీ ప్రచారం చేస్తోంది. కాగా ఎవరు ఎన్ని కోట్లు ఖర్చు పెడతారని ఎవరు ఎంతిస్తారని ప్రజలు వేచి చూస్తున్నారు.
రాజగోపాల్ రెడ్డి ఎందుకు రాజీనామా చేసిండో ఎవరికీ తెలియదని మరికొందరు మండిపడుతున్నారు. మొత్తంగా అందరూ తామే గెలుస్తామని
అంటున్నారు. కానీ మునుగోడులో మునిగేది మాత్రం జనమేనని తెలుసుకుంటే బెటర్.
Also Read : పని తీరు ఆధారంగానే సీట్లు కేటాయింపు