Munugodu By Poll Voters : అభ్యర్థుల భవితవ్యం ఓటర్లే కీలకం
మునుగోడు బై పోల్ లో బాద్ షా ఎవరో
Munugodu By Poll Voters : కోట్లు కుమ్మరించారు. సొమ్మసిల్లి పోయేలా చేశారు. మద్యం ఏరులై పారింది. నోట్ల కట్టలతో జనం పరేషాన్ అయ్యారు. దేశ వ్యాప్తంగా పలు చోట్ల ఉప ఎన్నికలు జరుగుతున్నా ప్రధానంగా మునుగోడు ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టింది. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశాడు.
ఆపై పార్టీకి గుడ్ బై చెప్పి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లా పోరాటాలకు పురిటిగడ్డ. ఇక్కడ కాంగ్రెస పార్టీతో పాటు కమ్యూనిష్టులకు పట్టు ఉండేది. కానీ ఈసారి ఉప ఎన్నికల్లో ఎర్ర జెండా పార్టీలు గులాబీ నీడన చేరి పోయాయి.
ఈ తరుణంలో బీజేపీ కేంద్ర నాయకత్వం పూర్తిగా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మునుగోడును. ఇక అధికార పార్టీకి జీవన్మరణ సమస్యగా మారింది. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సమన్వయ లోపం పార్టీ అభ్యర్థి పాలిట శాపంగా మారింది.
మొత్తంగా నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి స్రవంతి రెడ్డి, టీఆర్ఎస్ నుంచి ప్రభాకర్ రెడ్డి , బీఎస్పీ నుంచి నరిసింహ చారి ఉన్నారు.
ఇండిపెండెంట్లు ఉన్నప్పటికీ వారి ప్రభావం అంతంత మాత్రమే. నియోజకవర్గంలో మొత్తం 2,41,805 ఓటర్లు(Munugodu By Poll Voters) ఉన్నారు. ఎక్కువ శాతం బహుజనులు ఉండడం విశేషం. కాగా ప్రధాన పోటీ మాత్రం బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య నెలకొంది. ఇక వీరి భవిష్యత్తును కాంగ్రెస్ అభ్యర్థి ప్రభావితం చేయనుండడం ఖాయం.
యువతీ యువకుల ఓట్లు కీలకం కానున్నాయి. యువత ఎటు వైపు మళ్లుతుందనే దానిపైనే ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో అన్ని పార్టీలకు ఈ ఉప ఎన్నిక రిహార్సల్ గా మారనుంది. కేసీఆర్ చరిష్మా పని చేస్తుందా అమిత్ షా వ్యూహం(CM KCR VS Amit Shah) వర్కవుట్ అవుతుందా రేవంత్ దూకుడు సక్సెస్ అవుతుందా అన్నది తేలాల్సి ఉంది.
ఇప్పటికైనా ఓటర్లు మారాలి. అంబేద్కర్ చెప్పినట్టు ఓటు ఆయుధం దానిని సక్రమంగా వినియోగించుకోక పోతే నష్టపోయేది ప్రజలే. ప్రజాస్వామ్యం బతకాలంటే ఓటు కీలకం అన్న సంగతి తెలుసు కోవాలి.
Also Read : మునుగోడు ఉప ఎన్నికపై ఉత్కంఠ