Munugodu Voters Shock : ఆ మంత్రులకు ఓటర్లు ఝలక్
ఐదుగురు మంత్రులు ఫెయిల్
Munugodu Voters Shock : మునుగోడు ఉప ఎన్నికలు ముగిశాయి. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఘన విజయాన్ని సాధించింది. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగింది టీఆర్ఎస్. గులాబీ దళపతి , సీఎం కేసీఆర్ అన్నీ తానై వ్యవహరించారు. తానే ముందుండి నడిపించారు. దేశ రాజకీయాలలో కీలకమైన పాత్ర పోషించాలనే దిశగా పావులు కదుపుతున్నారు.
దీంతో మునుగోడు బై పోల్ ను రాబోయే ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావించింది. కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ తరుణంలో అధికార యంత్రాంగంతో పాటు పూర్తిగా పాలక వర్గం (మంత్రివర్గం) మునుగోడులో మకాం వేసింది.
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ప్రజా ప్రతినిధులు మొత్తం ఫోకస్ పెట్టడంతో విజయం సాధ్యమైంది.
ఎన్నికల సందర్భంగా మంత్రులకు ఇంఛార్జీలు అప్పగించింది పార్టీ. ఈ మంత్రుల్లో కొందరు సక్సెస్ అయితే ఐదుగురు మంత్రులు బాధ్యతలు తీసుకున్న వాటిలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అత్యధిక ఓట్లు రావడం కోలుకోలేని షాక్(Munugodu Voters Shock) ఇచ్చింది.
ప్రాతినిధ్యం వహించిన మంత్రుల్లో జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రయత్నాలు ఫలించ లేదు.
ఇదే క్రమంలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ , గంగుల, సత్యవతి , సబితా ఉన్న చోట మెజారిటీ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. మరి మెజారిటీ సాధించ లేని మంత్రులపై సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటారా అన్నది తేలాల్సి ఉంది.
Also Read : సత్తా చాటిన ఇండిపెండెంట్లు