Muttireddy Yadagiri Reddy : ఆర్టీసీ చైర్మ‌న్ గా ముత్తిరెడ్డి

బాధ్య‌త‌లు స్వ‌క‌రించిన వైనం

Muttireddy Yadagiri Reddy : హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) చైర్మ‌న్ గా నియ‌మితులైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరి రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించారు. హైద‌రాబాద్ లోని బ‌స్ భ‌వ‌న్ లోని త‌న ఛాంబ‌ర్ లో ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ ముత్తిరెడ్డితో సంత‌కం చేయించారు.

Muttireddy Yadagiri Reddy As a TSRTC Chairman

చైర్మ‌న్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన అనంత‌రం ముత్తిరెడ్డి యాద‌గిరి రెడ్డి(Muttireddy Yadagiri Reddy) మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. ఆయ‌న స‌మ‌ర్థ‌వంతుడైన ఐపీఎస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందార‌ని, సంస్థ‌ను న‌ష్టాల నుండి గ‌ట్టెక్కించేందుకు ఎంత‌గానో కృషి చేశారంటూ పేర్కొన్నారు.

ప్ర‌స్తుతం టీఎస్ఆర్టీసీ అన్ని విభాగాల్లో ముందుకు దూసుకు పోతోంద‌ని స్ప‌ష్టం చేశారు. సంస్థ ఉద్యోగులు రేయింబ‌వ‌ళ్లు ప‌ని చేస్తున్నార‌ని , తాను శాయ శ‌క్తులా సంస్థ పురోభివృద్ధికి కృషి చేస్తాన‌ని చెప్పారు ముత్తిరెడ్డి యాదిగిరి రెడ్డి.

ప్ర‌తి రోజూ ల‌క్ష‌లాది మంది ప్ర‌యాణీకులు ఆర్టీసీ బ‌స్సుల్లో ప్ర‌యాణం చేస్తున్నార‌ని వారికి ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్నాన‌ని అన్నారు. ఇదే స‌మ‌యంలో త‌న‌పై న‌మ్మ‌కం ఉంచి ఆర్టీసీ సంస్థ చైర్మ‌న్ గా ప‌ద‌విని క‌ట్టబెట్టిన సీఎం కేసీఆర్ కు రుణ‌ప‌డి ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు ముత్తిరెడ్డి యాదిగిరి రెడ్డి.

Also Read : CJI Chandrachud : ఇంకెంత కాలం భ‌య‌ప‌డుతూ బ‌త‌కడం

Leave A Reply

Your Email Id will not be published!