Gautam Adani Rajiv : రాజీవ్ ఉన్న‌ప్పుడే జర్నీ ప్రారంభం

గౌత‌మ్ అదానీ షాకింగ్ కామెంట్స్

Gautam Adani Rajiv : అదానీ గ్రూప్ సంస్థ‌ల చైర్మ‌న్ గౌత‌మ్ అదానీ (Gautam Adani) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు. ఈ దేశాన్ని అదానీ, అంబానీలు పాలిస్తున్నారంటూ ఆరోపించారు. దీనిని గౌత‌మ్ అదానీ తిప్పి కొట్టారు. అదానీ సంస్థ‌ల వ్యాపారం దివంగ‌త రాజీవ్ గాంధీ ప్ర‌ధాన‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ప్రారంభ‌మైంద‌ని స్ప‌ష్టం చేశారు.

త‌మ‌కు ఏ పార్టీతో సంబంధం లేద‌ని పేర్కొన్నారు. త‌మ‌కు ప్ర‌స్తుత ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ మ‌ద్ద‌తు ఇస్తున్నారంటూ చేస్తున్న ఆరోప‌ణ‌లను తోసిపుచ్చారు. త‌న వ్యాపార సామ్రాజానికి రాజీవ్ హ‌యాంలో ఉన్న‌ప్పుడే ప్రారంభ‌మైంద‌ని ఇందుకు దివంగ‌త నేత‌ను బాధ్యుడిని చేస్తామా అంటూ ప్ర‌శ్నించారు గౌత‌మ్ అదానీ.

త‌న వ్యాపార సామ్రాజ్యం మూడు ద‌శాబ్దాల కింద‌టే మొద‌లైంద‌న్నారు. త‌న వ్యాపారాన్ని ఏ ఒక్క రాజ‌కీయ నాయ‌కుడితోనూ ముడి పెట్ట లేమ‌న్నారు. మోదీతో సంబంధం అన్న‌ది పూర్తిగా అబ‌ద్ద‌మ‌ని కొట్టి పారేశారు గౌత‌మ్ అదానీ. అయితే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోదర దాస్ మోదీది నాదీ ఒకే ప్రాంతానికి చెందిన వాళ్లం మాత్ర‌మేన‌ని పేర్కొన్నారు.

దీని వ‌ల్ల సాన్నిహిత్యం మాత్ర‌మే ఉంద‌ని, అంత‌కు త‌ప్పించి వ్యాపార‌, వ్య‌వ‌హార సంబంధాలు లేవ‌ని స్ప‌ష్టం చేశారు. నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేయ‌డం, ఈ మేర‌కు క‌థ‌నాలు ప్ర‌సారం చేయ‌డం భావ్యం కాద‌న్నారు గౌతమ్ అదానీ(Gautam Adani). నా విజ‌యం ఏ ఒక్క నాయ‌కుడి స‌పోర్ట్ వ‌ల్ల జ‌ర‌గ‌లేద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు ఈ దిగ్గ‌జ వ్యాపార‌వేత్త‌.

రాజీవ్ గాంధీ పీఎంగా ఉన్న స‌మ‌యంలో ఎగుమ‌తి, దిగుమ‌తి విధానాన్ని స‌ర‌ళీక‌రించిన‌ప్పుడు మా జ‌ర్నీ స్టార్ట్ అయ్యింద‌న్నారు గౌత‌మ్ అదానీ.

Also Read : చందా..వేణుగోపాల్ క‌స్ట‌డీ పొడిగింపు

Leave A Reply

Your Email Id will not be published!