N Chandrasekaran : టాటా స‌న్స్ చైర్మ‌న్ గా చంద్ర‌శేఖ‌ర‌న్

ఐదేళ్ల పాటు ఆయ‌నే కొన‌సాగుతారు

N Chandrasekaran : భార‌త దేశంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన టాటా గ్రూపు సంస్థ‌ల కార్య‌నిర్వాహ‌క చైర్మ‌న్ గా ఎన్. చంద్ర‌శేఖ‌రన్ నియ‌మితుల‌య్యారు. ఆయ‌న ఈ ప‌ద‌విలో అయిదు సంవ‌త్స‌రాల పాటు కొన‌సాగుతారు.

ఈ విష‌యాన్ని టాటా గ్రూపు సంస్థ అధికారికంగా వెల్ల‌డించింది ఇవాళ‌. ఇదిలా ఉండ‌గా 2016 అక్టోబరు నెల‌లో చంద్ర‌శేఖ‌ర‌న్(N Chandrasekaran) టాటా స‌న్స్ బోర్డులో చేరారు. బోర్డు స‌భ్యులు ఎగ్జిక్యూటివ్ చైర్మ‌న్ ప‌నితీరును మెచ్చుకున్నారు.

దీంతో ఆయ‌న ప‌ద‌వీ కాలాన్ని పొడిగించ‌నున్నట్లు టాటా సంస్థ తెలిపింది. ఈ మేర‌కు రాబోయే ఐదేళ్ల దాకా ఆయ‌నే ఎగ్జిక్యూటివ్ చైర్మ‌న్ గా ఉండేందుకు బోర్డు ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపింద‌ని స్ప‌ష్టం చేసింది.

ఈ స‌మావేశానికి ప్ర‌త్యేక ఆహ్వానితుడిగా విచ్చేశారు దిగ్గ‌జ పారిశ్రామిక వేత్త ర‌త‌న్ టాటా. చంద్ర‌శేఖ‌రన్N Chandrasekaran) నేతృత్వంలోని టాటా గ్రూప్ పురోగ‌తి, ప‌నితీరుపై సంతృప్తి వ్య‌క్తం చేశారు.

త‌న ప‌ద‌వీ కాలాన్ని మ‌రో ఐదు సంవ‌త్స‌రాలు పొడిగించాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు ర‌త‌న్ టాటా. ఇదిలా ఉండ‌గా త‌న పునః నియామ‌కంపై శ్రీ చంద్ర‌శేఖ‌ర‌న్ మాట్లాడారు.

గ‌త ఐదేళ్లుగా టాటా గ్రూప్ న‌కు నాయ‌క‌త్వం వ‌హించ‌డం గ‌ర్వంగా, అదృష్టంగా భావిస్తున్నాన‌ని చెప్పారు. త‌దుప‌రి ద‌శ‌లో టాటా గ్రూపును మ‌రో కొంత కాలం పాటు న‌డిపించే అవ‌కాశం రావ‌డం ప‌ట్ల తాను సంతోషిస్తున్న‌ట్లు తెలిపారు.

కాగా 2016లో బోర్డులో చేరాడు చంద్ర‌శేఖ‌ర‌న్. 2017లో చైర్మ‌న్ గా నియ‌మితుల‌య్యారు. ఇదిలా ఉండ‌గా ఆర్థిక సంవ‌త్స‌రంలో టాటా గ్రూపు దాదాపు రూ. 7.7 ల‌క్ష‌ల కోట్లు ఆదాయాన్ని గ‌డించింది.

Also Read : మళ్లీ మొద‌టికొచ్చిన ముకేశ్ అంబానీ

Leave A Reply

Your Email Id will not be published!