N Raghuveera Reddy Comment : రాజువయ్యా ‘ర‌ఘు వీరా’ రెడ్డి

నీల‌కంఠాపురం నిన్ను చూసి గ‌ర్విస్తున్న‌ది

N Raghuveera Reddy Comment : ఏమిటీ నీల‌కంఠాపురం అనుకుంటున్నారా. ఆ ఊరికి ఓ చ‌రిత్ర ఉంది. అంత‌కంటే గొప్ప వ్య‌క్తుల‌కు ఆల‌వాలంగా మారింది. ప‌ల్లెకు త‌న వ్య‌క్తిత్వంతో పేరు తీసుకు వ‌చ్చారు మాజీ మంత్రి, సీనియ‌ర్ కాంగ్రెస్ నాయ‌కుడు నీల‌కంఠాపురం ర‌ఘువీరారెడ్డి.

ఆయ‌న త‌న ఊరునే త‌న ఇంటి పేరుగా మార్చుకున్నారు. ఉమ్మ‌డి ఏపీ రాష్ట్రంలో అంచెలంచెలుగా రాష్ట్ర స్థాయి దాకా ఎదిగారు.

ఆయ‌న సోద‌రుడు సుభాష్ రెడ్డి త‌న‌యుడే ఇవాళ భార‌త దేశాన్ని, యావ‌త్ ప్ర‌పంచాన్ని మెస్మ‌రైజ్ చేసిన దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్(Prasanth Neel).

ఏ చిన్న ప‌ద‌వి ద‌క్కినా చాలు అహంభావంతో విర్ర‌వీగే నాయ‌కులు కోకొల్ల‌లుగా ఉన్నారు. త‌న‌కు ప‌ద‌వులు ల‌భించినా ఆయ‌న వాటికి దూరంగా ఉన్నారు.

పూర్తి స్థాయి వ్య‌వ‌సాయ‌దారుడిగా మారి పోయారు. ఆధ్యాత్మిక చింత‌నా ప‌రుడిగా త‌న‌ను తాను తెలుసుకునే ప‌నిలో ఉన్నారు. తానే ముందుండి ఆల‌యాన్ని నిర్మించారు.

సామాజిక సేవా కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతున్నారు. ఇప్పుడు ఆ ఊరి జ‌నానికి ర‌ఘువీరారెడ్డే పెద్ద‌న్న‌. రాజ‌కీయం అంటే ఇవాళ ఎదుటి వాళ్ల‌ను మోసం

చేయ‌డం. లేదా దూషించ‌డం. వెగ‌టు క‌లిగిస్తున్న ఈ త‌రుణంలో ఆయ‌న విలువ‌ల‌కు క‌ట్టుబ‌డి ఉన్నారు.

ఇక త‌న‌కు హొదాలు, ప‌ద‌వులు అక్క‌ర్లేదేని సామాన్య జీవితం గ‌డుపుతున్నారు. క‌రువుకు కొండ గుర్తు అనంత‌పురం జిల్లా. ర‌ఘువీరారెడ్డి సిరులు పండించ‌లేక పోవ‌చ్చు.

కానీ కోల్పోయిన మాన‌వ సంబంధాల‌ను మ‌ళ్లీ పెంపొందించే ప‌నిలో ప‌డ్డారు. ఇలాంటి రాజ‌కీయ నాయ‌కులే కావాల్సింది. ఆయ‌న ఎంద‌రో సీఎంల వ‌ద్ద మంత్రిగా ప‌ని చేశారు.

కానీ ఇప్పుడు అత్యంత సాదా సీదాగా ఉండ‌డం నేటి త‌రానికి, యువ‌తీ యువ‌కుల‌కు ఆద‌ర్శ ప్రాయం కావాలి. క‌రువు ప్రాంతంలోని మ‌డ‌కశిర

నియోజ‌క‌వ‌ర్గంలోని నీల‌కంఠాపురంలో పుట్టారు.

ఆయ‌న త‌ల్లిదండ్రులు ఎన్ . న‌ర‌స‌మ్మ‌, ఎన్. కావేర‌ప్ప‌. వారికి వ్య‌వ‌సాయ యాద‌వ కుటుంబం. తండ్రి 30 ఏళ్ల పాటు గంగుళ‌పాలెం పంచాయ‌తీకి ప్రెసిడెంట్ గా ప‌ని చేశాడు.

పెద‌నాన్న శ్రీ‌రామ రెడ్డి క‌ర్ణాట‌క నుంచి రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ప‌ని చేశారు. ర‌ఘువీరా రెడ్డి బీఎస్సీ, ఎల్ఎల్బీ చ‌దివారు. 1985లో కాంగ్రెస్ పార్టీలో కార్య‌క‌ర్త‌గా చేరాడు.

1989లో మ‌డ‌క‌శిర నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కోట్ల కేబినెట్ లో ప‌శు సంవ‌ర్ద‌క శాఖ మంత్రిగా ప‌ని చేశారు. 1994లో ఓడి పోయాడు.

1999లో మ‌ళ్లీ ఎమ్మెల్యేగా గెలుపొందాడు. 2004లో వైఎస్సార్ కేబినెట్ లో వ్య‌వ‌సాయ శాఖ మంత్రిగా ప‌ని చేశాడు. 2009లో కళ్యాణ‌దుర్గం నుంచి

ఎమ్మెల్యేగా విజ‌యం సాధించాడు.

మ‌ళ్లీ అదే శాఖ మంత్రిగా కొలువు తీరాడు. రోశ‌య్య మంత్రివ‌ర్గంలో రెవిన్యూ శాఖ మంత్రిగా ప‌ని చేశాడు. ఏపీ విభజ‌న త‌ర్వాత ఏపీ పీసీసీ చీఫ్ గా ప‌ని

చేశారు ర‌ఘువీరా రెడ్డి. ఉన్న‌ట్టుండి రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.

ఇప్పుడు ఊరే త‌న‌కు లోకం..ప్ర‌పంచం నీల‌కంఠాపురం రఘువీరా రెడ్డి(N Raghuveera Reddy)కి. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఓటు వేసేందుకు అంద‌రితో పాటే తాను నిల్చుని ఓటు వేశాడు.

ఆ ఊరికి వెళ్లిన ఎవ‌రైనా స‌రే ర‌ఘువీరా రెడ్డిని క‌ల‌వాల్సిందే. ఆయ‌న ఆప్యాయంగా వ‌డ్డించే ఆత్మీయ భోజ‌నం రుచి చూడాల్సిందే.

జీవితం చాలా స్వ‌ల్పమైంది. ఊరు కంటే ఈ మ‌ట్టి కంటే ఏదీ గొప్ప‌ది కాదంటారు ఈ ర‌ఘువీరారెడ్డి. కుటుంబం బాగుంటే ప‌ల్లె బాగుంట‌ది.

స‌మిష్టి కుటుంబం..వ్య‌వ‌సాయం జీవితంలో కోల్పోయిందేమిటో చెబుతాయంటారు. అవును క‌దూ నిజంగా ర‌ఘువీరా రాజువ‌య్యా మ‌హ రాజువ‌య్యా

అంటున్నారు ఆ ఊరి జ‌నం.

Also Read : మోదీజీ ఇదేనా నారీ శ‌క్తి అంటే – కేటీఆర్

Leave A Reply

Your Email Id will not be published!