RRR Song Oscar : ఆర్ఆర్ఆర్ సాంగ్ ఆస్కార్ కు నామినేట్

నామినేష‌న్లు ప్ర‌క‌టించిన అవార్డుల క‌మిటీ

RRR Song Oscar : దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన రుద్రం – ర‌ణం – రౌద్రం (ఆర్ఆర్ఆర్) చిత్రం ఆస్కార్ అవార్డు కు నామినేట్ అయ్యింది. సినిమాకు సంబంధించి నాటు నాటు సాంగ్ ఉత్త‌మ ఒరిజిన‌ల్ సాంగ్(RRR Song Oscar) విభాగంలో చేరింది. ఇక ఆర్ఆర్ఆర్ ఆస్కార్ కి వెళ్లిన ఎంపిక చేసిన భార‌తీయ చిత్రాల స‌మూహంలో చేరింది.

మ‌ద‌ర్ ఇండియా, స‌లామ్ బాంబే, ల‌గాన్ ఉత్త‌మ అంత‌ర్జాతీయ చల‌న చిత్రంగా నామినేట్ అయ్యాయి. మంగ‌ళ‌వారం 95వ ఆస్కార్ అకాడ‌మీ అవార్డుల‌కు నామినేష్లు డిక్లేర్ చేశారు. ఇప్ప‌టికే నాటు నాటు సాంగ్ ప్ర‌తిష్టాత్మ‌క‌మైన గోల్డెన్ గ్లోబ్ పుర‌స్కారం స్వంతం చేసుకుంది. గోల్డెన్ గ్లోబ్ కు ఆస్కార్ ను జోడించిన‌ట్ల‌యితే నాటు నాటు పాట(RRR Song Oscar) సంగీత ద‌ర్శ‌కుడు ఎంఎం కీర‌వాణి భార‌తీయ ఆస్కార్ విజేత‌ల బృందంలో భాగం అవుతారు.

ఇందులో గాంధీకి ఉత్త‌మ కాస్ట్యూమ్ డిజైన్ ను గెలుచుకున్న భాను అత‌య్య‌, ఏఆర్ రెహ‌మాన్ , గుల్జార్ , సౌండ్ ఇంజ‌నీర్ రెసూల్ కుట్టి ఉన్నారు. భార‌త దేశంలోని బ్రిటీష్ నిర్మాత చిత్రం స్ల‌మ్ డాగ్ మిలియ‌నీర్ లో ఆస్కార్ అవార్డులు ఇప్ప‌టికే ద‌క్కాయి. ఇక ఆస్కార్ నామినేష‌న్ల‌ను న‌టుటు రిజ్ అహ్మ‌ద్ , అలిస‌న్ విలియ‌మ్స్ ప్ర‌క‌టించారు.

మార్చి 12న లాస్ ఏంజెల్స్ లో 95వ అకాడ‌మీ అవార్డుల ప్ర‌ధానం జ‌ర‌గ‌నుంది. చాట్ షో హోస్ట్ జిమ్మీ కిమ్మెల్ మూడోసారి హోస్ట్ చేయ‌నున్నారు. మొత్తంగా ఆర్ఆర్ఆర్ సాంగ్ దుమ్ము రేప‌నుంది.

జ‌క్క‌న్న ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టించ‌గా చంద్ర‌బోస్ నాటు నాటు సాంగ్ ను రాశారు. రాహుల్ సిప్లిగంజ్ పాడారు.

Also Read : అంజ‌న్న స‌న్నిధిలో జ‌న‌సేనాని

Leave A Reply

Your Email Id will not be published!