Nadendla Manohar : ఆర్బీకేలు రైతు నిరాశా కేంద్రాలు
జనసేన నేత నాదెండ్ల మనోహర్
Nadendla Manohar : మంగళగిరి – ఏపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్(Nadendla Manohar). రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను జగన్ నిర్వీర్యం చేశాడని మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జగన్ రెడ్డి ఏర్పాటు చేసిన ఆర్బీకే సెంటర్లపై సెటైర్ వేశారు. అవి రైతు నిరాశా కేంద్రాలంటూ పేర్కొన్నారు.
Nadendla Manohar Comment
ఆర్బీకే సెంటర్ల ద్వారా రైతులకు మిగిలింది ఏమీ లేదన్నారు 10,408 కేంద్రాల నిర్మాణం పేరుతో రూ.2,300 కోట్ల ఉపాధి హామీ నిధులు పొందారని..ఇందులో 3,200 మాత్రమే నిర్మించారని ధ్వజమెత్తారు. కనీసం పనులు కూడా మొదలు కానివి 4,500 కేంద్రాలు ఉన్నాయని ఆరోపించారు మనోహర్.
ఆర్బీకేలకు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో బడ్జెట్లో కేటాయించింది రూ.158 కోట్లు మాత్రమేనని ధ్వజమెత్తారు. అద్దె డబ్బులు చెల్లించక పోవడంతో చాలా కేంద్రాలు మూత పడుతున్నాయని వాపోయారు.
ఉపాధి హామీ నిధులతో పంట కాలువలను అభివృద్ధి చేసి ఉంటే సాగుకు ఉపయోగ పడేవన్నారు. ఇక వైసీపీ నేతలు చెప్పినట్లుగానే ఆర్బీకేలు నడుస్తున్నాయంటూ ఆరోపించారు.
Also Read : Ram Gopal Varma : 29న వ్యూహం మూవీ రిలీజ్