Ram Gopal Varma : 29న వ్యూహం మూవీ రిలీజ్

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు ఆర్జీవీ

Ram Gopal Varma : విజ‌య‌వాడ – వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న తాజాగా తీసిన వ్యూహం మూవీకి సంబంధించి ఇటీవ‌లే సెన్సార్ బోర్డు కొన్ని అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తూ విడుద‌ల‌కు అనుమ‌తి ఇచ్చింది.

Ram Gopal Varma Movie Updates

ఇందులో భాగంగా విజ‌య‌వాడ ఇందిరా గాంధీ స్టేడియంలో వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వ‌హిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షించారు ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌(Ram Gopal Varma), నిర్మాత దాస‌రి కిర‌ణ్ కుమార్.

ఈనెల 29న వ్యూహం చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఈ చిత్రాన్ని రాజ‌కీయాల కోసం తీయ‌లేద‌న్నారు. ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన అనంత‌రం ఆర్జీవీ మీడియాతో మాట్లాడారు. వేరే వాళ్ల మీద వ్యూహం తీశాం కానీ త‌మ మీద త‌మ‌కు వ్యూహం అన్న‌ది లేద‌న్నారు.

తాను తీసిన వ్యూహంలో చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్, చిరంజీవి, వైఎస్ ష‌ర్మిల‌, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పాత్ర‌లు ఉంటాయ‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : Chandra Babu Case : బాబుకు ఊర‌ట విచార‌ణ వాయిదా

Leave A Reply

Your Email Id will not be published!