Nagarjuna : తన కుమారుడి వివాహానికి సీఎం చంద్రబాబు ఆహ్వానం

అక్కినేని అఖిల్ ప్రస్తుతం సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్నారు...

Nagarjuna : అక్కినేని నాగార్జున ఇప్పుడు కుబేర సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమాలో కోలీవుడ్ హీరో ధనుష్, రష్మిక మందన్నా నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది. మరోవైపు అక్కినేని వారి ఇంట పెళ్లి బజాలు మోగనున్నాయి. త్వరలోనే నాగార్జున(Nagarjuna) చిన్న కొడుకు అఖిల్ వివాహం జరగనుంది. ఈ క్రమంలోనే సినీ నటుడు నాగార్జున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కలిసి తన చిన్న కొడుకు అఖిల్ వివాహానికి రావాల్సిందిగా చంద్రబాబును స్వయంగా ఆహ్వానించి వివాహ పత్రిక అందజేశారు.

Nagarjuna Invites CM Chandrababu

గతేడాది నవంబర్ నెలలో అక్కినేని అఖిల్, జైనబ్ రవ్జీ అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరు ఇప్పుడు పెద్దల సమక్షంలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. వీరిద్దరి వివాహం జూన్ 6న హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలోనే జరగనున్నట్లు సమాచారం. గతేడాది హీరో నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల వివాహం సైతం అదే స్టూడియోలో జరిగింది.

అక్కినేని అఖిల్ ప్రస్తుతం సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్నారు. 2015లో అఖిల్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత ఆయన నటించిన హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఏజెంట్ సినిమాలు సైతం అంతగా ఆకట్టుకోలేదు. ఇప్పుడు లెనిన్ చిత్రంలో నటిస్తున్నారు అఖిల్. కిశోర్ అబ్బూరు ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తుంది.

Also Read : Minister Anagani : మాజీ సీఎం జగన్ పై మంత్రి అనగాని సంచలన వ్యాఖ్యలు

Leave A Reply

Your Email Id will not be published!