Nagendra Babu : ఓటు కోసం నాగేంద్ర బాబు దరఖాస్తు
తెలంగాణలో ఓటు వేసిన సినీ నటుడు
Nagendra Babu : అమరావతి – రెండు చోట్లా ఓటు హక్కు ఉపయోగించు కోవడం చట్ట రీత్యా నేరం. ఎక్కడో ఒక చోట మాత్రమే తమ ఓటు వినియోగించు కోవాల్సి ఉంటుంది. విచిత్రం ఏమిటంటే తెలంగాణ రాష్ట్రంలో సెటిలర్స్ తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కానీ ఇదే సమయంలో ఇక్కడ ఉన్న వారు తిరిగి ఆంధ్ర ప్రదేశ్ లో తమ ఓటు హక్కు వినియోగించు కునేందుకు గాను తిరిగి దరఖాస్తు చేసుకోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.
Nagendra Babu Applying Vote
కేంద్ర ఎన్నికల సంఘం ఒక్క చోట మాత్రమే ఉపయోగించు కోవాల్సి ఉంటుందని కచ్చితంగా నిబంధనల్లో పేర్కొంది. ఇక్కడా అక్కడ ఓటు హక్కు ఉండడం పూర్తిగా చట్ట విరుద్దం కానుందని తెలిపింది.
మరో వైపు దొంగ ఓట్లు ఏరి వేతకు ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్దమైంది. ఇదే సమయంలో దొంగ ఓట్ల నమోదు చేశారంటూ గతంలో ఏపీలో పాలించిన టీడీపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీలు.
ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ సోదరుడు కొణిదెల నాగ బాబు(Nagendra Babu) రెండో ఓటు నమోదుకు గాను ఏపీలో దరఖాస్తు చేసుకోవడంపై తీవ్ర విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఒకరికి ఆదర్శంగా ఉండాల్సిన నటులు ఇలా వ్యవహరిస్తే ఎలా అని మండిపడుతున్నారు.
ఖైరతాబాద్ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ 168లో సీరియల్ నెంబర్ 323 పేరుతో ఓటు వేశారు. 324 నంబర్ కలిగిన కొణిదల పద్మజ, 325 నెంబర్ కలిగిన సాయి వరుణ్ తేజ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Also Read : Smita Sabharwal : తళుక్కుమన్న స్మితా సబర్వాల్