Najam Sethi : పీసీబీ చైర్మన్ నుంచి తప్పుకున్న సేథీ
సంక్షోభానికి తెర తీసిన నజామ్ నిర్ణయం
Najam Sethi : పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో సంక్షోభం నెలకొంది. ఇప్పటికే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న క్రికెట్ టీం పెను సమస్యలతో సతమతం అవుతోంది. గతంలో పీసీబీ చైర్మన్ గా మాజీ క్రికెటర్ రమీజ్ రజా ఉన్నారు. ఆయనను తన సహచరుడైన మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ నియమించారు. తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నా రమీజ్ రాజా. ఇదిలా ఉండగా పాకిస్తాన్ లో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఇమ్రాన్ వైదొలిగాడు. ఆయన స్థానంలో షెహబాజ్ షరీఫ్ వచ్చారు.
ఆ వెంటనే రమీజ్ రాజాను రాజీనామా చేయమని కోరడంతో తప్పుకున్నారు. ఈ తరుణంలో రజా స్థానంలో నజామ్ సేథీ(Najam Sethi) పీసీబీ చైర్మన్ గా కొలువు తీరారు. సాధ్యమైనంత మేరకు పీసీబీని గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేశాడు. అటు బీసీసీఐతో, ఏసీబీతో, ఐసీసీతో సామరస్య పూర్వకమైన ధోరణితో క్రికెట్ ఆడేలా చూశారు. కానీ ఉన్నట్టుండి సంచలన ప్రకటన చేశారు నజామ్ సేథీ. ట్విట్టర్ వేదికగా తాను పీసీబీ చైర్మన్ రేసులో లేనంటూ ప్రకటించారు.
ప్రస్తుతం ఆయన చేసిన ప్రకటన కలకలం రేపింది. ఇప్పటికే వన్డే వరల్డ్ కప్ లో ఆడాల్సి ఉంది. జూన్ 21 వరకు తన పదవీకాలం ఉందని, ఇక దీని బాధ్యతలను తాను మోయలేనంటూ వాపోయాడు. తాను పీఎం, ఆయన సోదరుడు నవాజ్ షరీఫ్ ల మధ్య వివాదానికి కారణం కాకూడదని కోరుకుంటున్నట్లు సేథీ బాంబు పేల్చాడు. మొత్తంగా పీసీబీ లో సేథి నిర్ణయం కుదిపేస్తోంది.
Also Read : Lust Stories 2 Trailer : రెచ్చి పోయిన తమన్నా..వర్మ
