Najam Sethi : ఐపీఎల్ కంటే పీఎస్ఎల్ గొప్ప
పీసీబీ చైర్మన్ నజామ్ సేథీ
Najam Sethi PSL : పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ నజామ్ సేథీ మరోసారి నోరు పారేసుకున్నాడు. భారత్ పై అక్కసు వెళ్లగక్కడం ఒక పరిపాటిగా మారింది. ఆయన ఇండియన్ ప్రిమీయర్ లీగ్ డిజిటల్ రేటింగ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు.
ఐపీఎల్ డిజిటల్ పరంగా చూస్తే 130 మిలియన్లు అని అదే పాకిస్తాన్ సూపర్ లీగ్(Najam Sethi PSL) పరంగా చూస్తే 150 మిలియన్ల దాకా ఉందన్నారు. దీన్ని బట్టి చూస్తే పీఎస్ఎల్ ఐపీఎల్ కంటే ఎక్కువేనని భావించక తప్పదన్నారు.
రాబోయే రోజుల్లో పాకిస్తాన్ క్రికెట్ లీగ్ లు మరింత ఆదరణ పొందుతాయని చెప్పారు. ఇదిలా ఉండగా నజామ్ సేథీ పీసీబీ చైర్మన్ అయ్యాక కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే ఇదే ఏడాది ఆసియా కప్ కు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. దీనిపై ఇప్పటికే భారత జట్టు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. తాము పాకిస్తాన్ కు వెళ్లమని బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. ఎందుకంటే తమకు ఆట కంటే ఆటగాళ్ల ప్రాణాలు ముఖ్యమని స్పష్టం చేశారు బీసీసీఐ కార్యదర్శి జే షా.
ఇదే విషయాన్ని క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా స్పందించారు. పాకిస్తాన్ భారత్ తో ఆడక పోతే తమకు వచ్చిన నష్టం ఏమీ లేదన్నాడు. విచిత్రం ఏమిటంటే వారికే ఎక్కువ నష్టం వాటిల్లక తప్పదన్నారు. ఒకవేళ తమ దేశంలోకి వస్తే పూర్తి భద్రత ఉంటుందన్నారు ఠాకూర్. ఇదే సమయంలో కాదు కూడదని అనుకుంటే తటస్థ వేధికపై నిర్వహించాలని మధ్యేమార్గాన్ని సూచించింది బీసీసీఐ. కానీ దానికి ఒప్పుకోలేదు నజామ్ సేథి(Najam Sethi PSL).
Also Read : యూపీ వారియర్స్ అదుర్స్