Nandamuri Taraka Ratna : తారకరత్న మరణం తీరని విషాదం
40 ఏళ్లకే లోకాన్ని వీడిన నటుడు
Nandamuri Taraka Ratna : తెలుగు సినిమా రంగంలో విషాదం అలుముకుంది. నందమూరి తారక రామారావు ఫ్యామిలీకి చెందిన నటుడు నందమూరి తారకరత్న శనివారం కన్నుమూశారు(RIP Taraka Ratna). 23 రోజుల పాటు ఆయన మృత్యువుతో పోరాడారు. బెంగళూరులోని నారాయణ హృదాయలయలో చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు. జనవరి 8, 1983లో పుట్టారు. ఫిబ్రవరి 18, 2023న మరణించారు. కేవలం ఆయన వయస్సు 40 ఏళ్లు మాత్రమే కావడం విషాదం.
ఎంతో భవిష్యత్తు ఉన్న నటుడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు తారకరత్న. ఎంపీ విజయ సాయి రెడ్డి భార్య చెల్లెలి కూతురే నందమూరి తారకరత్న భార్య అలేఖ్య. ఎన్టీఆర్ తాత. నందమూరి బాలకృష్ణ బాబాయ్ అవుతారు. నందమూరి కళ్యాణ్ రామ్ పెదనాన్న కుమారుడు. దగ్గుబాటి పురందేశ్వరి మేనత్త. తారకరత్న(Nandamuri Taraka Ratna) 2001లో ఒకేసారి 9 సినిమాలు మొదలు పెట్టి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఆయన తండ్రి నందమూరి మోహన కృష్ణ. తారకరత్న అంటే నందమూరి బాలకృష్ణకు పంచ ప్రాణం.
చివరి వరకు ఆయనే దగ్గరుండి చూసుకున్నారు. కంటికి రెప్పలా ..కానీ కాపాడు కోలేక పోయారు. ఒకటో నెంబర్ కుర్రాడు, యువ రత్న, తారక్ , శివుడు, భద్రాద్రి రాముడు, అమరావి, వెంకటాద్రి, ముక్కంటి , నందీశ్వరుడు, విజేత, ఎదురులేని అలెగ్జాండర్ , చూడాలని చెప్పాలని , మహా భక్త సిరియాల, కాకతీయుడు, ఎవరు , మనమంతా , రాజా చెయ్యి వేస్తే , ఖయ్యూం భాయ్ , దేవినేని , సారధి సినిమాల్లో నటించారు. వెబ్ సీరీస్ 9 అవర్స్ లో నటించారు ఇటీవలే. 2009లో ఉత్తమ ప్రతినాయకుడు అవార్డు పొందారు తారకరత్న(RIP Taraka Ratna).
Also Read : తారకరత్న అంటే బాలయ్యకు ప్రాణం