Nara Lokesh : ముగిసిన నారా లోకేష్ విచారణ
వేసిన ప్రశ్నలే వేశారు..విసిగించారు
Nara Lokesh : అమరావతి – ఐఆర్ఆర్ ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్మెంట్ స్కాం కేసులో ఏ14గా ఉన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెండో రోజు ఏపీ సీఐడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఆయనను రెండు రోజుల పాటు ప్రశ్నించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ముందస్తు అరెస్ట్ చేయకుండా విచారణ చేపట్టాలని ఆదేశించింది.
Nara Lokesh Ring Road Case
తొలి రోజు 50 ప్రశ్నలు సంధించారని వాటికి తీరికగా సమాధానం చెప్పానని విచారణ అనంతరం నారా లోకేష్(Nara Lokesh) మీడియా ముందు చెప్పారు. హైకోర్టు ఈ కేసుకు సంబంధించి ఒక్క రోజు మాత్రమే హాజరు కావాలని ఆదేశించిందన్నారు. కానీ ఏపీ సీఐడీ మరో రోజు కూడా రావాలని కోరారని, వారి కోరిక మన్నించి తాను హాజరైనట్లు తెలిపారు.
సుమారు ఆరు గంటల పాటు ప్రశ్నించారని, నిన్నటి ప్రశ్నలనే తిప్పి తిప్పి అడిగారంటూ ఎద్దేవా చేశారు. కొత్తగా ఎలాంటి ఆధారాలు స్కాంకు సంబంధించి చూపించ లేదని స్పష్టం చేశారు నారా లోకేష్. ఇవాళ 45 ప్రశ్నలు అడిగారని తెలిపారు.
వీటిలో ఒకటి రెండు తప్ప అన్నీ నిన్నటి ప్రశ్నలే అడిగారంటూ పేర్కొన్నారు. ఆనాడు తాను నిర్వహించిన శాఖకు సంబంధించని ప్రశ్నలు వేశారని మండిపడ్డారు నారా లోకేష్.
Also Read : AP CM YS Jagan Distribute : అక్కా చెల్లెమ్మళ్లకు ఇళ్ల పంపిణీ