Sajjala Ramakrishna Reddy : బాబుపై స‌జ్జ‌ల సెటైర్

ఆయ‌నేమ‌న్నా విప్ల‌వ‌కారుడా

Sajjala Ramakrishna Reddy : తాడేప‌ల్లి గూడెం – ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీ స్కిల్ స్కాం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న నారా చంద్ర‌బాబు నాయుడుపై మండిప‌డ్డారు. ఆయ‌నేమ‌న్నా పోరాట యోధుడా లేక విప్ల‌వ కారుడా అని ఎద్దేవా చేశారు. స‌జ్జ‌ల మీడియాతో మాట్లాడారు.

Sajjala Ramakrishna Reddy Slams Chandrababu

రూ. 3 వేల కోట్లు చూపించి రూ. 371 కోట్లు అప్పన్నంగా కొట్టేశారంటూ ఆరోపించారు. విచార‌ణ‌కు హాజ‌రు కాకుండా బెయిల్ పై ఇన్నాళ్ల పాటు త‌ప్పించుకున్నాడ‌ని మండిప‌డ్డారు. ప్ర‌జ‌ల‌ను దోచుకునేందుకే ప్ర‌య‌త్నం చేశాడ‌ని , అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్లాది రూపాయ‌ల ఆస్తుల‌ను వెన‌కేసుకున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు.

త‌ను త‌ప్పు చేశాడా లేదా అన్న‌ది తేల్చు కోవాల్సింది చంద్ర‌బాబు నాయుడేన‌ని స్ప‌ష్టం చేశారు సజ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి(Sajjala Ramakrishna Reddy). ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి పేరుకు భార‌తీయ జ‌న‌తా పార్టీ అధ్య‌క్షురాలైనా ఆమె వాస్త‌వానికి ప్ర‌స్తుతం టీడీపీకి చీఫ్ గా వ్య‌వ‌హ‌రిస్తోందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

మ‌ద్యం స్కాం అనేది ఓ సాకు మాత్ర‌మేన‌ని, ఆమె చేసేవ‌న్నీ రాజ‌కీయ ఆరోప‌ణ‌లేన‌ని పేర్కొన్నారు. అరెస్ట్ చేసేందుకు కూడా ప్రోటోకాల్ పాటిస్తారా అని ప్ర‌శ్నించారు. త‌ప్పు చేశాడు , ఆధారాలు ఉన్నాయి కాబ‌ట్టే కోర్టు రిమాండ్ కు పంపింద‌న్నారు. ఉన్న‌తాధికారులు అభ్యంత‌రం వ్య‌క్తం చేసినా సంత‌కం చేశార‌ని ఆరోపించారు.

Also Read : Nara Lokesh : ముగిసిన నారా లోకేష్ విచార‌ణ

Leave A Reply

Your Email Id will not be published!