Nara Lokesh : బాబు అరెస్ట్ పై వినూత్న నిర‌స‌న

న్యాయానికి సంకెళ్లు పేరుతో ప్రోగ్రాం

Nara Lokesh : అమ‌రావ‌తి – ఏపీ స్కిల్ స్కాం కేసులో అడ్డంగా బుక్కై రాజ‌మండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు అరెస్ట్ ను నిర‌సిస్తూ తెలుగుదేశం పార్టీ వినూత్న నిర‌స‌న‌కు శ్రీ‌కారం చుట్టింది. ఇప్ప‌టికే వివిధ రూపాల‌లో ఆందోళ‌న‌లు చేప‌డుతోంది.

Nara Lokesh Comment

ఆదివారం న్యాయానికి సంకెళ్లు పేరుతో వినూత్న నిర‌స‌న చేప‌ట్టింది. టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌తి ఒక్క‌రు ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మంలో పాల్గొనాల‌ని, మ‌న స‌త్తా ఏమిటో ఏపీ స‌ర్కార్ కు చూపించాల‌ని పిలుపునిచ్చారు .

రాత్రి 7 గంట‌ల‌కు చేతుల‌కు తాళ్లు, రిబ్బ‌న్లు క‌ట్టుకుని నిర‌స‌న తెల‌పాల‌ని అన్నారు. అంతే కాదు న్యాయానికి సంకెళ్లా అంటూ నినాదాలు చేయాల‌ని కోరారు నారా లోకేష్(Nara Lokesh). అంతే కాకుండా నిర‌స‌న తెలిపిన వీడియోల‌ను సామాజిక మాధ్య‌మాల‌లో పోస్ట్ చేయాల‌ని సూచించారు.

తాము చేప‌ట్టిన ధ‌ర్మ పోరాటానికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరారు. త‌న తండ్రి నారా చంద్ర‌బాబు నాయుడును జైలు లోనే అంతం చేయాల‌ని ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డి కుట్ర ప‌న్నుతున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

Also Read : Daggubati Purandeswari : మ‌ద్యంపై ఏపీ స‌ర్కార్ కాకి లెక్క‌లు

Leave A Reply

Your Email Id will not be published!