Nara Lokesh : పాలన అస్తవ్యస్తం ప్రజలకు శాపం
నిప్పులు చెరిగిన నారా లోకేష్
Nara Lokesh : యలమంచలి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన గాడి తప్పిందని , ప్రజలకు ఒక రకంగా శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh). యువ గళం రెండో విడత పాదయాత్ర సందర్బంగా యలమంచలి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్బంగా విద్యార్థులు, మత్స్యకారులు, ఇతర వర్గాలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి సమస్యలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేశారు నారా లోకేష్.
Nara Lokesh Comments on AP CM YS Jagan
యువగళం పాదయాత్రకు మహిళలు, యువకులు, విద్యార్థులు సాదర స్వాగతం పలకండం ఆనందంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం, జనసేన సంకీర్ణ సర్కార్ రాబోతోందని జోష్యం చెప్పారు. తాము పవర్ లోకి వచ్చాక జనరంజక పాలన అందజేస్తామని స్పష్టం చేశారు.
సంక్షేమ పథకాల పేరుతో బురిడీ కొట్టించడం తప్ప చేసింది ఏమీ లేదన్నారు. తుపాను కారణంగా నష్ట పోయిన వారిని ఆదుకున్న పాపాన పోలేదన్నారు. కేవలం ఎన్నికల్లో గెలిచేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడని కానీ జగన్ మోహన్ రెడ్డికి అంత సీన్ లేదన్నారు నారా లోకేష్. వచ్చే ఎన్నికల్లో తగిన రీతిలో బుద్ది చెప్పేందుకు రెడీగా ఉన్నారంటూ హెచ్చరించారు.
Also Read : Gaddam Prasad Kumar : నలుగురికి ప్యానల్ స్పీకర్లుగా ఛాన్స్