Nara Lokesh : సామాన్య భక్తుల కష్టాలు తీర్చండి
ఇకనైనా భక్తుల గురించి ఆలోచించండి
Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని టార్గెట్ చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ఇప్పటికే అన్యమతస్తుల చేతుల్లోకి టీటీడీ వెళ్లేలా చేసిన ఘనుడు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటూ మండిపడ్డారు.
Nara Lokesh Slams Bhumana
తమ ప్రభుత్వ హయాంలో అత్యం పకడ్బందీగా చర్యలు తీసుకున్నామని, హిందూ ధర్మానికి కట్టుబడి నిర్ణయాలు తీసుకునేలా చేశామన్నారు. కానీ జగన్ రెడ్డి వచ్చాక టీటీడీ పాలక మండలి పనితీరు దారుణంగా తయారైందన్నారు. ఫక్తు తిరుమలను వ్యాపార కేంద్రంగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
విచిత్రం ఏమిటంటే తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి ఏరికోరి తిరిగి టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టారంటూ ఆరోపించారు. ఆయన విచిత్రంగా తిరుమల కొండను బోడి గుండుతో పోల్చాడని అంతే కాదు భక్తులకు సెక్యూరిటీ కల్పించాల్సిన చైర్మన్ వాళ్లకు చేతి కర్రలు ఇస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందంటూ ఎద్దేవా చేశారు నారా లోకేష్.
మంగళవారం ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. అడ్డమైన ఆలోచనలు కట్టబెట్టి మెరుగైన వసతి సౌకర్యాలు భక్తులకు కల్పించేలా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చూడాలని స్పష్టం చేశారు.
Also Read : Udhayanidhi Stalin : నా తల కోసం ఎవరు వస్తారో చూస్తా