Narayana Bharath Gupta : ఐఏఎస్ కు వన్నె తెచ్చిన భరత్ గుప్తా
నారాయణ భరత్ గుప్త ప్రస్థానం ప్రశంసనీయం
Narayana Bharath Gupta : చిన్న పదవి దక్కితే లేదా ఉన్నత ఉద్యోగం లభిస్తే చాలు తమంతటి వారు లేరనే వారు కోకొల్లలు. కానీ కొందరు మాత్రం ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా తమంతకు తాము పని చేసుకుంటూ వెళతారు.
తమదైన ముద్ర వేస్తారు. ప్రజలకు సేవ చేయడంలో వారు అందరికంటే ముందుంటారు. అలాంటి వారిలో ఏపీకి చెందిన ఐఏఎస్ ఆఫీసర్ నారాయణ భరత్ గుప్త(Narayana Bharath Gupta). ఆయన స్వస్థలం అనంతపురం జిల్లా గుత్తి.
చిన్నప్పటి నుంచీ ఆయనకు చదువంటే చచ్చేంత ప్రేమ. అంతకంటే ఇష్టం కూడా. కష్టపడి డాక్టర్ సీటు కొట్టేసి వైద్యుడయ్యాడు. డాక్టరైతే కొంత మందికే సేవ చేయగలను.
అదే సివిల్ సర్వీస్ లో కి ఎంటరైతే వేలాది మందికి సేవ చేయొచ్చన్న ఆశయమే తనను కలెక్టర్ ను చేసింది. +
దేశ వ్యాప్తంగా నిర్వహించిన పోటీల్లో ఏకంగా నారాయణ భరత్ గుప్త 17వ ర్యాంకు సాధించాడు.
ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కోవడంలో ఉన్నంత తృప్తి ఇంకెందులోనూ ఉండదంటాడు.
ప్రజా సేవకే ప్రయారిటీ ఇస్తున్నారు. మదనపల్లె సబ్ కలెక్టర్ గా మొదటిసారి పోస్టింగ్ పొందారు.
అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ గా పదోన్నతి పొందారు. శ్రీశైలం దేవస్థానం ఇఓగా పని చేశారు.
ఇక్కడ ఆయన చేసిన అభివృద్ధిని చూసిన వారు విస్తు పోవాల్సిందే. ఎవరూ చేయలేని పనుల్ని నారయణ భరత్ గుప్త చేసి చూపించారు.
ఒక ఐఏఎస్ అధికారి తలుచుకుంటే ఎలాంటి అభివృద్ధి చేయగలరో చూసి తీరాల్సిందే. తిరుమల తిరుపతి దేవస్థానంతో వసతి సౌకర్యాలలో పోటీ పడేలా ఆయన తీర్చిదిద్దారు.
సుందరమైన, ఆధ్యాత్మికత ఉట్టి పడే శైవ క్షేత్రంగా భాసిల్లేలా తీర్చిదిద్దారు.
రోడ్లు, వీధి లైట్లు, షాప్స్ , భక్తులకు ఇబ్బంది లేకుండా టాయిలెట్స్ ..ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ పారదర్శకంగా ఉండేలా చేశారు.
అనంతరం రాష్ట్ర పవర్ కార్పొరేషన్ లో విధులు చేపట్టారు. 2019 జూన్ 6న చిత్తూరు జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు.
తనదైన ముద్ర వేశారు నారాయణ భరత్ గుప్త. ప్రస్తుతం ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులయ్యారు. అంతే కాకుండా డైరెక్టరేట్ ఆఫ్ గ్రామ వాలంటరీ సంస్థకు డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు చేపట్టారు.
ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్లు నూటికి ఓ పది మంది దాకా ఉంటారు. అత్యంత సాధారణంగా కనిపించే నారాయణ భరత్ గుప్తా మాటలు మాట్లాడటం కంటే ఆచరణలో చేసి చూపించేందుకే ఎక్కువగా ఇష్టపడతారు.
కరవుకు, కక్షలకు , కార్ఫణ్యాలకు నెలవైన అనంతపురం జిల్లా నుంచి వచ్చిన ఆయన ఇప్పుడు యువతకే కాదు రాష్ట్రానికి ఓ ఆదర్శమైన ఆఫీసర్ అనడంలో అతిశయోక్తి లేదు.
Also Read : తీగ లాగితే డొంకంతా కదులుతోంది