Naresh Pavitra Lokesh : నరేష్..ప‌విత్ర లిప్ కిస్ వైర‌ల్

లేటు వ‌య‌సులో ఘాటు ప్రేమ

Naresh Pavitra Lokesh : ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో చెప్ప‌లేం. ఈ మ‌ధ్య సినిమా రంగంలో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది ఎక్కువగా హాట్ టాపిక్ గా మారింది మాత్రం దివంగ‌త న‌టుడు న‌రేష్. ఆయ‌న మ‌రో న‌టి ప‌విత్రా లోకేష్ (Naresh Pavitra Lokesh) తో క‌లిసి బ‌హిరంగంగా తిర‌గ‌డం చ‌ర్చ‌కు దారి తీసింది.

త‌మ సంబంధం గురించి మీకెందుకు అంటూ ఇద్ద‌రూ పేర్కొన్నారు. మొద‌టి భార్య బెంగ‌ళూరులో వీరిద్ద‌రూ ఉండ‌గా రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకోవ‌డం, అది దేశ వ్యాప్తంగా వైర‌ల్ గా మార‌డం జ‌రిగింది. తాజాగా కొత్త సంవ‌త్స‌రం రాబోతున్న త‌రుణంలో ఊహించ‌ని రీతిలో ట్విస్ట్ ఇచ్చారు న‌రేష్, ప‌విత్ర క‌ళ్యాణ్. ఇద్ద‌రూ తాజాగా రెచ్చి పోయారు.

ఏకంగా అధ‌ర చుంబ‌నంతో దుమ్ము లేపారు. చీక‌టి వేళ‌, లైట్ల వెలుతురో ఇద్ద‌రూ ఒక‌రినొక‌రు పెద‌వుల‌పై ముద్దు పెట్టుకోవ‌డం, ఇందుకు సంబంధించిన ఫోటోలు , వీడియో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఇటీవ‌లే తండ్రి న‌టశేఖ‌ర కృష్ణ ఈ లోకాన్ని వీడారు. అంత లోపే న‌రేష్, ప‌విత్రా లోకేష్ ఒక్క‌టి అవుతున్నామంటూ సంకేతం ఇవ్వ‌డం చ‌ర్చ‌కు దారి తీసింది.

రిలేష‌న్ షిప్ విష‌యంలో అధికారికంగా ఇప్ప‌టి వ‌ర‌కు వీరిద్ద‌రూ ప్ర‌క‌టించ లేదు. ఇద్ద‌రూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ పెద్దఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. ఇక కొత్త ఏడాదికి స్వాగ‌తం ప‌లుకుతూ తాజాగా రిలీజ్ చేసిన వీడియో ఆక‌ట్టుకుంటోంది. అంత‌కంటే మించి లేటు వ‌య‌స్సులో ఘాటు ప్రేమ ఏమిటో అంటూ మ‌రికొంద‌రు ట్వీట్ చేస్తున్నారు.

Also Read : హాట్ అందాలతో మేస్స్మరైజ్ చేసిన డింపుల్ హయతీ

Leave A Reply

Your Email Id will not be published!