Naseeruuddin Shah : మోదీ సర్కార్ పై నసీరుద్దీన్ షా ఫైర్
లారెన్స్ బిష్ణోయ్ పై మండిపాటు
Naseeruuddin Shah : ముంబై – దేశంలో కొలువు తీరిన మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రముఖ బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా. ట్విట్టర్ వేదికగా సీరియస్ కామెంట్స్ చేయడం కలకలం రేపింది. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ చేస్తున్న ఆగడాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా బాధ్యత వహించాల్సింది కేంద్ర సర్కారేనంటూ ధ్వజమెత్తారు.
Naseeruuddin Shah Serious Comments on Modi Ruling
ఇలా ఎంత కాలం ఎంత మందిని చంపుకుంటూ పోతారంటూ ప్రశ్నించారు నసీరుద్దీన్ షా(Naseeruuddin Shah). గ్యాంగ్ స్టర్ తన టీంతో సురక్షితంగా జైలులో ఉన్నారని, అతడికి ఎవరు మద్దతు ఇస్తున్నారో చెప్పాలంటూ నిలదీశారు.
ప్రముఖ పంజాబీ సింగర్ , కాంగ్రెస్ నేత సిద్దూ మూసేవాలాను దారుణ హత్యకు గురయ్యారు. అతడి హత్య కేసులో లారెన్స్ బిష్ణోయ్ ప్రమేయం ఉందని తేల్చారు. ఇదే సమయంలో రాజస్థాన్ లో ఎన్నికలు అయి పోయాయి. ఫలితాలు వచ్చాయి.
సుఖ్ దేవ్ సింగ్ గోగమేడి హత్యకు గురయ్యారు. ఈ హత్యలకు లారెన్స్ బాధ్యత వహించాల్సిందేనంటూ స్పష్టం చేశారు నసీరుద్దీన్ షా. ఈ హత్యలకు ప్రస్తుత మోదీ ప్రభుత్వం లేదా అని పేర్కొన్నారు.
Also Read : Bhadradri : వైకుంఠ ఏకాదశికి భద్రాద్రి ముస్తాబు