Natasa Stankovic Pandya : పాండ్యా భార్య భావోద్వేగం
ఐపీఎల్ చాంపియన్ అనంతరం దృశ్యం
Natasa Stankovic Pandya : ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ ముగిసింది. కానీ అరుదైన సన్నివేశాలు, అద్భుతమైన పరిణామాలకు వేదికగా మారింది. ఒక్కో విజయం జట్టుకు టానిక్ లాగా పని చేస్తే మరికొన్ని గెలుపులు చిరస్మరణీయంగా దాచుకునేలా చేశాయి.
కళ్లు చెదిరేలా ఫోర్లు, సిక్సర్లు , క్యాచ్ లు, స్టంప్ ఔట్ లు, అందమైన అమ్మాయిలు..ఇలా ప్రతిదీ ఈసారి ఐపీఎల్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
ఇక ఎలాంటి అంచనాలు లేకుండానే కొత్తగా ఐపీఎల్ లో ఎంటరైన గుజరాత్ టైటాన్స్ ఊహించని రీతిలో దిగ్గజ జట్లకు కోలుకోలేని రీతిలో షాక్ ఇస్తూ విజేతగా నిలిచింది.
దీని వెనుక కఠోర శ్రమ ఉంది. కోచ్ ప్లాన్ తో పాటు కెప్టెన్ హార్దిక్ పాండ్యా పట్టుదల తోడైంది. గత రెండేళ్లుగా పాండ్యా ఇబ్బందుల్లో ఉన్నాడు. జాతీయ జట్టుకు దూరమయ్యాడు.
కానీ అనుకోని అవకాశం తలుపు తట్టడంతో తనను తాను నిరూపించుకున్నాడు. విజయవంతమైన నాయకుడిగా అవతరించాడు. ఐపీఎల్ ఛాంపియన్ గా తన జట్టును నిలిపాడు. క్యాష్ ప్రైజ్ రూ. 20 కోట్లు కావచ్చు.
కానీ ఇప్పుడు ఆ జట్టుకు అతడే బ్రాండ్ అంబాసిడర్. ఇక ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించిన వెంటనే లక్షలాది ప్రజలు జేజేలు పలికారు. ఇదే సమయంలో పాండ్యా ఒక మాట అన్నాడు.
మా జట్టే కాదు ప్రత్యర్థి జట్టు కూడా బాగా ఆడిందని మెచ్చుకున్నాడు. కాగా అప్పటి దాకా తీవ్ర ఉత్కంఠతో ఉన్న భార్య నటాషా స్టాంకోవిచ్(Natasa Stankovic Pandya) మైదానంలోకి వచ్చింది.
భావోద్వేగానికి లోనైంది. పాండ్యాను ఆలింగనం చేసుకుంది. విజయం ఇచ్చే కిక్కు ఇంకేదీ ఇవ్వదని చూస్తే తెలుస్తుంది కదూ.
Also Read : పడి లేచిన కెరటం పాండ్యా