Natasha Feel : అయ్యో నటాషా పాక్ ఓటమిపై నిరాశ
ఆట అన్నాక గెలుపు ఓటములు సహజం
Natasha Feel : ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా ముద్దుగుమ్మలు ఎక్కడున్నా క్రికెట్ కు సంబంధించిన కెమెరాలే కాదు ఫోన్లు, సెల్ఫీలు , ఫోటోలతో నిండి పోతున్నాయి. టోర్నీ ముగిసినా ఒక్కరు మాత్రం నెట్టింట్లో వైరల్ గా మారారు.
ఒక్క రోజులోనే వేలాది మంది లైకులు కొట్టారు. ఆ అమ్మాయి ఎవరో కాదు పాకిస్తాన్ కు చెందిన నటాషా. ఆమెకు సంబంధించిన వీడియోలు, ఫోటోలతో ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ లతో తన ఖాతాలో నింపేసింది. అంతే కాదు భారత జట్టు ఫైనల్ కు వస్తే చూడాలని ఉందంటూ కోరుకుంది.
కానీ అల్లా దయ దల్చలేదు. ఆపై ఇంగ్లండ్ చేతిలో భారత జట్టు 10 వికెట్ల తేడాతో ఓడి పోయింది. ఇంటి బాట పట్టింది. దీంతో నటాషా(Natasha Feel) తీవ్ర ఆవేదన చెందింది. అయ్యో ఎలా ఇండియా ఫైనల్ లో ఆడితే ఆ మజా వేరని అనుకుంది. కానీ ఆట కదూ. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు.
ఇదే సమయంలో తన దేశానికి చెందిన పాకిస్తాన్ జట్టు సెమీస్ లో న్యూజిలాండ్ పై 7 వికెట్ల తేడాతో ఓడించి నేరుగా ఫైనల్ కు చేరింది. దీంతో నటాషా సంతోషానికి లోనైంది. ఇదే సమయంలో తన దేశం టి20 కప్ ఎగరేసుకు పోవాలని కోరుకుంది. కానీ ఇంగ్లండ్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.
దీంతో ట్విట్టర్ వేదికగా ఈ ముద్దుగుమ్మ ఆశించింది జరగక పోవడంతో నిరాశకు లోనైంది. ఈ మేరకు ఆట అన్నాక గెలుపు ఓటములు సహజమని పేర్కొంది. దీంతో నెటిజన్లు అయ్యో నటాషా ఎందుకింత నిరాశ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా ఓ సెల్ఫీతో సరిపుచ్చింది.
Also Read : ఆఫ్గాన్ ముద్దుగుమ్మ హల్ చల్