Nathan Ellis : నిప్పులు చెరిగిన నాథన్ ఎల్లిస్
పంజాబ్ గెలుపులో కీలక పాత్ర
Nathan Ellis : గౌహతిలో జరిగిన ఎనిమిదో లీగ్ మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్ కు మజాను మిగిల్చింది. తొలిసారిగా ఐపీఎల్ కు ఆతిథ్యం ఇచ్చిన ఈ మైదానంలో రాజస్థాన్ రాయల్స్ , పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్లు హోరా హోరీగా తలపడ్డాయి. చివరి బంతి దాకా ఉత్కంఠ భరితంగా సాగింది. ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి. పంజాబ్ స్కిప్పర్ సైతం టెన్షన్ కు లోనయ్యాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 4 వికెట్లు కోల్పోయి 197 రన్స్ చేసింది. స్కోర్ భారీ అయినా చివరి క్షణం వరకు అలుపెరుగని పోరాటం చేసింది రాజస్థాన్ రాయల్స్. ఓ వైపు పంజాబ్ బౌలర్లు నాథన్ ఎల్లిస్(Nathan Ellis) , అర్ష్ దీప్ , సామ్ కరన్ లు కళ్లు చెదిరే బంతులతో కట్టడి చేశారు. నాథన్ ఎల్లిస్ ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. కీలకమైన వికెట్లను కూల్చాడు.
తొలి వికెట్లను అర్ష్ దీప్ పడగొడితే పంజాబ్ విజయానికి బాటలు వేశాడు సామ్ కరన్. ఇక నాథన్ ఎల్లిస్ తన కెరీర్ లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసుకున్నాడు. కేవలం 30 పరుగులు మాత్రమే ఇచ్చిన ఎల్లిస్ జోస్ బట్లర్ , సంజూ శాంసన్, దేవదత్ పడిక్కల్ , రియాన్ పరాగ్ ల వికెట్లను తీసి రాజస్థాన్ పరాజయాన్ని శాసించాడు నాథన్ ఎల్లిస్.
దీంతో 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 193 పరుగులకే పరిమితమైంది. 5 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయినా ఫ్యాన్స్ మనసులు గెలుచుకుంది. ఇదిలా ఉండగా నాథన్ ఎల్లీస్(Nathan Ellis) 100 వికెట్లు పూర్తి చేశాడు. 86 మ్యాచ్ లు ఆడాడు. 22.68 సగటుతో 104 వికెట్లు పడగొట్టాడు.
Also Read : శిఖర్ ధావన్ ధనా ధన్