National Comment : స్కాంలు సరే బకాయిల రద్దు ఎందుకు
ప్రియమైన ప్రధానిజీ ఈ దేశం కోరుతోంది
National Comment : అప్పుడెప్పుడో సీపీఐ ఎంఎల్ కు చెందిన తరిమెల నాగిరెడ్డి తాకట్టులో భారత దేశం అని రాశారు. ఆధారాలతో సహా ఈ దేశం ఎలా అక్రమార్కులకు, అవినీతి పరులకు ఎలా దాసోహం అంటుందో గుర్తించి ముందే హెచ్చరించారు.
కానీ ఎందరో హెచ్చరించినా దేశం మారడం లేదు. దీనికి కారణం ఎవరు. ఎలా వీళ్లకు రుణాలు అందుతున్నాయి. దోచుకుంటున్న డబ్బంతా ఎక్కడికి వెళుతోంది.
ఎవరైనా ఆలోచిస్తున్నారా. ఇవాళ ఆజాదీ కా అమృత్ మహొత్సవ్ అంటూ ఉత్సవాలు జరుపుకుంటున్నాం. కానీ ఏం సాధించామని జరుపుకోవాలి జెండా పండుగను.
ఒక రకంగా పూర్తిగా అప్పుల కుప్పను చేసేశారు పాలకులు. గతంలో ఏలిన వారు ప్రస్తుతం ఏలుతున్న వారంతా ఈ పాపాలకు, అక్రమాల పుట్టలకు కారకులే. విచిత్రం ఏమిటంటే కోట్లాది రూపాయలు ప్రభుత్వ బ్యాంకులకు కన్నం వేసి, కుచ్చు టోపీ పెట్టి జల్సాలకు అలవాటు పడిన నేరగాళ్లు యధేశ్చగా తిరుగుతుంటే దేశం ఏం చేస్తోంది.
స్విస్ బ్యాంకులో దాచుకున్న డబ్బుల్ని కక్కిస్తామని, అక్రమార్కుల భరతం పడతామని ప్రకటించిన మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారో జనాలు తెలుసు కోవాలని అనుకుంటున్నారు(National Comment) .
విచిత్రం ఏమిటంటే ఉద్దేశ పూర్వకంగానే రుణాలను ఎగ్గొట్టిన వారి సంఖ్య అక్షరాలా 10,306 మంది. మరి వారి నుంచి ముక్కుపిండి వసూలు చేయాల్సిన కాషాయ ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా వారు తీసుకున్న రుణాలను రద్దు చేసింది.
ఆ రద్దు చేసిన కోట్లు ఎన్నంటే అక్షరాల రూ. 10 లక్షల కోట్లు. ఇదంతా రాజకీయ పార్టీలు, నాయకులది అనుకుంటే పొరపాటే ప్రతి పైసా 133 కోట్ల భారతీయులు కష్టపడి సంపాదించింది.
దీనికి ప్రధానితో పాటు అమ్మకానికి ముందుండే నిర్మలా సీతారామన్ చెప్పాలి.
Also Read : పీఎంఎల్ఏ చట్టం ప్రమాదకరం