National Comment : గవర్నర్ లక్ష్మణ రేఖ దాటితే ఎలా
వివాదాస్పద కామెంట్స్ కలకలం
National Comment : మరాఠా మండుతోంది. రాష్ట్రానికి మొదటి పౌరుడిగా భావించే అత్యన్నత పదవి గవర్నర్. రాజ్యాంగానికి సేఫ్ గార్డ్ గా పేర్కొంటారు రాష్ట్రపతిని. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ముందు చూపుతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
సమాఖ్య వ్యవస్థకు కీలకమైన పదవులలో సీఎం, గవర్నర్, ప్రధానమంత్రి, రాష్ట్రపతి. పాలన అంతా సీఎం చేతుల్లో నడిచినా గవర్నర్ పేరు మీదే అంతా నడుస్తుంటుంది.
ఆనాటి దివంగత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ నుంచి నేడు కేంద్రంలో కొలువు తీరిన నరేంద్ర మోదీ పాలన వరకు తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటోంది గవర్నర్ల వ్యవస్థ.
బీజేపీ పాలిత రాష్ట్రాలలో సవ్యంగా నడిచినా బీజేపీయేతర రాష్ట్రాలలో ఉప్పు నిప్పులాగా ఉంటోంది. తాజాగా మరాఠా గవర్నర్ భగత్ సింగ్ కోష్యార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర రాద్దాంతానికి దారి తీశాయి.
గుజరాతీలు, రాజస్థానీల వల్లే మరాఠా అభివృద్ది చెందిందని, ఒక వేళ గనుక వీరంతా వెళ్లిపోతే ముంబై ఖాళీ అవుతుందన్నారు. ఆపై దేశ ఆర్థిక రాజధానిగా ఉండదని సెలవిచ్చారు.
రాష్ట్రానికి బాధ్యత కలిగిన వ్యక్తి. భరోసా ఇవ్వాల్సిన గవర్నర్ ఇలా చవకబారు కామెంట్స్ చేయడం కలకలం రేపుతోంది. నాలుక ఉందని ఏదైనా అంటాం అంటే కుదరదు.
ప్రజాస్వామ్యంలో జవాబుదారీ తనం అన్నది తప్పక ఉంటుందని గుర్తించక పోతే ఎలా. గవర్నర్ తన పరిధిని దాటి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరాఠా ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలను(National Comment) రగిలించేలా చేస్తోంది.
రాష్ట్రపతి అయినా లేదా గవర్నర్ అయినా రాజ్యాంగ బద్దమైన ఇరుసులో ఉండాలే తప్పా రాజకీయాలలో వేలు పెడితే ఇలాగే ఉంటుంది. ఇకనైనా గవర్నర్ హుందాగా క్షమాపణలు చెబితే బాగుంటుంది. లేక పోతే తనను తాను తక్కువ చేసుకున్నట్లవుతుంది.
Also Read : గవర్నర్ క్షమాపణ చెప్పాల్సిందే