National Comment : పార్థా సరే దొరకని దొంగలు ఎందరో
కళ్లు చెదిరే కట్టలు..జిగేల్ మనిపించే బంగారం
National Comment : ఈ దేశంలో లెక్కకు మించి సంపద పోగవుతోంది. కానీ కొద్ది మంది చేతుల్లోనే బందీ అవుతోంది. అది పక్కన పెడితే ఇటీవల మంచికో చెడుకో దాడుల పరంపర పెరిగింది.
లెక్కలేనన్ని కేసులు, దాడులు కొనసాగుతున్నాయి. అరెస్ట్ లు జరుగుతున్నాయి. ఇదంతా కేంద్రం కావాలని చేస్తోందని బుకాయించినా ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నా అసలు పట్టుబడుతున్న కోట్ల కొద్దీ నోట్ల కట్టలు ఎక్కడి నుంచి వస్తున్నాయి.
ఎవరి ద్వారా అందుతున్నాయి. ఇదంతా వీరేమైనా కష్టార్జితంతో సంపాదించారా. ఒకవేళ జీవిత కాలం మొత్తం చెమట చిందించినా అంత డబ్బులు సంపాదించేందుకు వీలు లేదు.
ఎన్నికల సందర్భంగా ఏకంగా ట్రక్కులను తీసుకు రావాల్సి వచ్చింది ఈడీకి. యూపీలోని సమాజ్ వాది పార్టీకి చెందిన వ్యాపారిగా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి(National Comment) .
తాజాగా పశ్చిమ బెంగాల్ మంత్రి సహాయకురాలి నిర్వాకం కళ్లు బైర్లు కమ్మేలా చేశాయి. ఎక్కడ చూసినా రూ. 500, రూ. 2000 నోట్ల కట్టలే కుప్పలుగా పోశారు.
దాడులు చేసిన ఈడీ అధికారులు మూర్చ పోయేలా 5 కేజీల బంగారం. వందల కోట్లు ఎక్కడ మాయమవుతున్నాయి. ఎవరి బొక్కల్లోకి వెళుతున్నాయో అర్థం కాని పరిస్థితి.
మోదీ కొలువు తీరాక స్విస్ బ్యాంకుల్లో భారతీయులు అక్రమంగా దాచుకుంటున్న సొమ్ము పదింతలు పెరిగిందని అంచనా. ప్రస్తుతానికి పార్థా ఛటర్జీ దొరికి ఉండవచ్చు.
కానీ దొరకని దొంగలు కోట్లల్లో ఉంటారు. వీళ్లను అరెస్ట్ చేస్తే జైళ్లు సరిపోక పోవచ్చు. ప్రజల్లో చైతన్యం, ప్రశ్నించే తత్వం రానంత వరకు ఇలాగే ఊరేగుతారు తస్మాత్ జాగ్రత్త.
Also Read : కారు దిగేందుకు అర్పితా ససేమిరా