National Flag Comment : జాతీయ జెండా పార్టీలది కాదు దేశానిది
జాతి ఆత్మ గౌరవానికి ప్రతీక జెండా
National Flag Comment : ప్రస్తుత మార్కెట్ ప్రపంచంలో ప్రతిదీ వ్యాపారంగా మారి పోయింది. చివరకు జాతీయ జెండా విషయంలో తీవ్రమైన చర్చోప చర్చలు జరుగుతున్నాయి.
ఎందుకు జెండాకు అంతటి గౌరవం. దాని వెనుక ఉన్న కథేంటి. ప్రతి దేశానికి ఓ జాతీయ పతాకం తప్పనిసరిగా ఉంటుంది. ఆ దేశానికి సంబంధించిన ఆత్మ గౌరవానికి జెండా అన్నది ప్రతీకగా నిలుస్తుంది.
అందుకే దానికి ఎనలేని గౌరవం, అంతులేని విలువ కూడా. దానికంటూ ప్రోటోకాల్ ఉంటుంది. ఎవరు పడితే వాళ్లు లేదా ఎక్కడ పడితే అక్కడ
వాడేందుకు వీలు లేదు. ఉండదు కూడా.
కొన్ని అసాధారణమైన పరిస్థితుల్లో మాత్రమే కిందకు దించుతారు. రెండు సందర్భాలలో జాతీయ జెండాను (National Flag) ఎగుర వేస్తారు. భారత రాజ్యాంగానికి గుర్తుగా రిపబ్లిక్ డే 26 జనవరి రోజున. రెండోది దేశానికి స్వతంత్రం వచ్చిన ఆగస్టు 15న త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తారు.
ఒకరు రాష్ట్రపతి ఇంకొకరు ప్రధానమంత్రి దీనికి బాధ్యత వహిస్తారు. జాతీయ జెండాలో కుంకుమ, తెలుపు, ఆకు పచ్చ రంగులు కలిగి ఉంటుంది. మధ్యలో బుద్దునికి ప్రతీకగా అశోక చక్రం ఉంటుంది.
22 జూలై 1947న జరిగిన రాజ్యాంగ సభ సమావేశంలో ఆమోదించారు. 15 ఆగస్టు 1947న భారత డొమినియన్ అధికారిక జెండాగా మారింది. తర్వాత రిపబ్లిక్ ఆఫ్ ఇండియాగా మారింది.
త్రివర్ణ పతాకం ప్రతి చోటా వినిపిస్తూనే ఉన్నది. 133 కోట్ల ప్రజల గొంతుకగా నినదిస్తూనే ఉంది. దీనిని ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య రూపొందించారు.
ఇందుకు సంబంధించి ప్రత్యేకమైన చట్టం కూడా తయారు చేశారు. భారతీయ త్రివర్ణ పతాకాన్ని ఖాదీతో తయారు చేయాలి. గాంధీ ఆనాడు తయారు
చేసిన వస్త్రం. జెండాను(National Flag) తయారు చేసే హక్కు ఖాదీ డెవలప్ మెంట్ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ కు ఉండేది.
2009 నాటికి కర్ణాటక ఖాదీ గ్రామోద్యోగ సంయుక్త సంఘం మాత్రమే ఏకైక తయారీదారుగా ఉంది. ఆగస్టు 15, జనవరి 26న మాత్రమే జెండాలను వినియోగించాలి. 2002లో నవీన్ జిందాల్ కోర్టుకు ఎక్కారు.
సాధారణ పౌరులు కూడా భారతీయ త్రివర్ణ పతాకాలను వినియోగించేలా ఆదేశించాలని కోరారు. ఈ మేరకు కేంద్ర సర్కార్ ను ఆదేశించింది.
ఇదిలా ఉండగా గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది మోదీ ప్రభుత్వం(PM Modi Govt) తీసుకున్న నిర్ణయం . 75 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా దేశ వ్యాప్తంగా జెండాలను ఎగుర వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
విచిత్రం ఏమిటంటే ఆ జెండాలు ప్లాస్టిక్ తో తయారీ కావడం, పోస్టాఫీసు ద్వారా జెండాలను అమ్మడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పు పట్టింది.
చివరకు త్రివర్ణ పతాకాలను సైతం అమ్మకానికి పెట్టారంటూ వాయనాడు ఎంపీ రాహుల్ గాందీతో పాటు ప్రతిపక్షాల నేతలు తప్పుపట్టారు. భారతీయ పతాకం ముమ్మాటికీ ప్రజలది..ఈ దేశానికి చెందినది..పార్టీలది మాత్రం కాదని తెలుసు కోవాలి.
Also Read : కోర్టు తీర్పుతో హిందువుల సంబురాలు