LT Disha Amrith : పరేడ్ లో కవాతుకు ‘దిశా’ నాయకత్వం
నేవల్ కంటెంజెంట్ కి మహిళా అధికారిణి
LT Disha Amrith : నేవీకి చెందిన మహిళా అధికారిణి దిశా అమృత్ కు అరుదైన గౌరవం దక్కింది. భారత గణతంత్ర దినోత్సవం జనవరి 26 సందర్భంగా నిర్వహించే పరేడ్ లో నేవల్ కంటెంజెంట్ కి మహిళా ఆఫీసర్ దిశా అమృత్(LT Disha Amrith) నాయకత్వం వహించనున్నారు. కర్తవ్య పథంలో జరిగే ఈ కవాతులో ముగ్గురు మహిళలు, ఐదుగురు పురుషులు , అగ్నివీరులు కూడా పాల్గొంటారని నేవీ తెలిపింది. ఇదిలా ఉండగా మంగళూరుకు చెందిన ఈ అధికారి 2016లో నేవీలోకి ప్రవేశించారు.
మొత్తం 144 మంది యువ నావికులతో కూడిన భారత నావికాదళానికి చెందిన రిపబ్లిక్ డే బృందానికి నేతృత్వం వహిస్తున్న మహిళ నౌకాదళ ఎయిర్ ఆపరేషన్స్ అధికారి లెఫ్టినెంట్ కమాండర్ దిశా అమృత్ నారీ శక్తిని ప్రదర్శిస్తుంది. దిశా అమృత్ తో పాటు మరో మహిళా అధికారి సబ్ లెఫ్టినెంట్ వల్లి మీనా , నౌకాదళ బృందంలోని ముగ్గురు ప్లాటూన్ కమాండర్లలో ఉంటారు.
కాగా దిశా అమృత్(LT Disha Amrith) కర్ణాటక లోని బీఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి కంప్యూటర్ సైన్స్ లో బ్యాచ్ లర్ ఆఫ్ ఇంజనీరింగ్ చదివారు. ఆమెకు ఇప్పుడు 29 ఏళ్లు. 208లో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ రిపబ్లిక్ టీమ్ లో భాగమైంది. 2017లో శిక్షణ పూర్తి చేసుకుని అండమాన్ నికోబార్ దీవుల్లోని కీలక నౌకాదళ కేంద్రంలో నియమితులయ్యారు.
ఈ సందర్భంగా దిశా అమృత్ మాట్లాడుతూ తన కల నెరవేర బోతున్నందుకు ఆనందంగా ఉందన్నారు. సాయుధ దళాలలో భాగం కావాలని కోరుకున్నాని అది నిజమైందని చెప్పారు.
Also Read : ‘కావ్యా’ ప్లీజ్ పెళ్లి చేసుకోవా