Navaneet Kaur Rana : బండారుపై భగ్గుమన్న నవనీత్ కౌర్
మంత్రి ఆర్కే రోజాకు సంఘీభావం
Navaneet Kaur Rana : మహారాష్ట్ర – ప్రముఖ నటి, స్వతంత్ర లోక్ సభ సభ్యురాలు (ఎంపీ ) నవనీత్ కౌర్ రాణా నిప్పులు చెరిగారు. ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణికి మద్దతు ప్రకటించారు. యావత్ మహిళా లోకం సంఘీభావం తెలుపాలని పిలుపునిచ్చారు.
Navaneet Kaur Rana Comments on Bandaru Satyanarayana
తాజాగా ఆర్కే రోజాపై అత్యంత నీచాతినీచంగా మాట్లాడిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బండారు సత్య నారాయణ చౌదరిపై తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం అవుతోంది. దేశ వ్యాప్తంగా ఆర్కే రోజాకు మద్దతుగా నిలిచారు ప్రముఖ నటులు రాధికా శరత్ కుమార్, ఖుష్బూ సుందర్. తాజాగా వారి సరసన మరో నటి నవనీత్ కౌర్ రాణా(Navanet Kaur Rana) నిలిచారు.
మాజీ మంత్రికి మతి పోయిందని, ఇలాంటి వ్యాఖ్యలు చేసేందుకు నోరు ఎలా వచ్చిందంటూ ప్రశ్నించారు ఎంపీ. తన ఇంట్లో మహిళలు లేరా అని నిలదీశారు. కనీసం మాట్లాడే ముందు సిగ్గు పడాలి అని అన్నారు. పురుష అహంకారంతో సాటి మహిళలు అన్న గౌరవం లేకుండా నోరు పారేసుకుంటే ఊరుకుంటారని అనుకున్నారా అని నిలదీశారు.
బేషరతుగా మంత్రి ఆర్కే రోజాకు క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. వెంటనే నాన్ బెయిల్ బుల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఎంపీ.
Also Read : Perni Nani : ఆస్తులపై విచారణకు బాబు సిద్దమా