Naveen Ul Haq : కోహ్లీ నిర్వాకం ఉల్ హ‌క్ ఆగ్ర‌హం

కోహ్లీ..న‌వీన్..గంభీర్ మ‌ధ్య వివాదం

Naveen Ul Haq : ఐపీఎల్ 16వ సీజ‌న్ లో విరాట్ కోహ్లీ(Virat Kohli) దురుసు ప్ర‌వ‌ర్త‌న త‌ల దించుకునేలా చేసింది. క్రికెట్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ మ‌ధ్య కీల‌క మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ గెలుపొందింది. కానీ ఇదే స‌మ‌యంలో మైదానంలో ఆట‌గాళ్ల మ‌ధ్య చోటు చేసుకున్న వివాదం హాట్ టాపిక్ గా మారింది.

చివ‌ర‌కు బీసీసీఐ రంగంలోకి దిగింది. వెంట‌నే విచార‌ణ చేప‌ట్టింది ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) ప‌ర్య‌వేక్ష‌ణ క‌మిటీ. ఈ మేర‌కు విరాట్ కోహ్లీకి మ్యాచ్ ఫీజులో 100 శాతం, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ మెంటార్ గా ఉన్న గౌత‌మ్ గంభీర్ కు మ్యాచ్ ఫీజులో వంద శాతం విధించింది. దీనిపై తీవ్ర రాద్దాంతం చోటు చేసుకుంది. ట్విట్ట‌ర్ లో కోహ్లీ, గంభీర్ వివాదం ఇంకా ట్రెండింగ్ లో కొన‌సాగుతోంది.

మాజీ క్రికెట‌ర్లు తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు. ఇద్ద‌రూ సంయ‌మ‌నం పాటించాల‌ని, క్రీడా స్పూర్తికి విఘాతం క‌లిగించేలా ప్ర‌వ‌ర్తించ‌డం దారుణ‌మ‌ని పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా మ్యాచ్ సంద‌ర్భంగా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న న‌వీన్ ఉల్ హ‌క్ ను టీజ్ చేశారు విరాట్ కోహ్లీ. దీనిపై తీవ్ర అభ్యంత‌రం తెలిపాడు. ఇదే విష‌యంపై ల‌క్నో బౌల‌ర్ అమిత్ మిశ్రా న‌వీన్ ను గేలి(Naveen Ul Haq) చేసిన కోహ్లీ గురించి క్రీజులో ఉన్న మ్యాచ్ అంపైర్ కు ఫిర్యాదు చేశాడు.

Also Read : కోహ్లీ గంభీర్ మ‌ధ్య స‌యోధ్య‌కు రెడీ

Leave A Reply

Your Email Id will not be published!